విరాట్ చేసిన ఆ పని ఎప్పటికీ మరిచిపోలేను, ఆ రోజు ఏడ్చేశా... - సూర్యకుమార్ యాదవ్...

First Published Jul 10, 2021, 12:49 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన చాలామంది ప్లేయర్లు మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటి, తమను తాము నిరూపించుకున్నారు. ఈ లిస్టులో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకడు...

ఐపీఎల్‌లో వరుసగా నాలుగు సీజన్లు 400+ పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు.. మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి బ్యాటింగ్ కూడా రాలేదు...
undefined
అయితే రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి ప్రమోషన్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, తాను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు... అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాది, సెన్సేషన్ క్రియేట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్...
undefined
‘విరాట్ కోహ్లీ అంటే నాకు ఎంతో గౌరవం. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో తన వన్‌డౌన్ ప్లేస్‌ని నాకిచ్చాడు విరాట్. నాపై విరాట్‌కి ఉన్న నమ్మకం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది...
undefined
టీమిండియాకి ఆడాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నారు. మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ రాకపోయేసరికి చాలా నిరాశ చెందా. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో నాకు ఛాన్స్ ఇవ్వాలని విరాట్, తనని తాను నాలుగో స్థానానికి మార్చుకున్నాడు...
undefined
ఆ విషయం తెలియగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏడ్చేశా... అయితే విరాట్ నాకు ధైర్యం చెప్పి, నన్ను మోటివేట్ చేశాడు...’ అంటూ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్...
undefined
ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో తన పేరు లేకపోవడం చూసి ఎంతో నిరుత్సాహానికి గురయ్యానని చెప్పిన సూర్యకుమార్ యాదవ్, ఆ సమయంలో రోహిత్ శర్మ తనకు అండగా నిలబడ్డాడని చెప్పుకొచ్చాడు...
undefined
‘ముంబై ఇండియన్స్ లాంటి టాప్ టీమ్‌కి ఆడడం నా అదృష్టం. రోహిత్ శర్మ, డి కాక్ ఆడుతుంటే చూడడాన్ని బాగా ఎంజాయ్ చేస్తా... వారిద్దరూ జోష్ మీద ఉన్నప్పుడు వారి స్పీడ్‌ని అందుకోవడం చాలా కష్టమే.
undefined
ఐపీఎల్ 2020 సీజన్‌లో మంచిగానే రాణించా. నా పర్ఫామెన్స్‌పై నాకు సంతృప్తి కలిగింది. అయితే ఆస్ట్రేలియాకి ఎంపిక చేసిన జట్టులో నా పేరు లేకపోవడం చూసి బాగా నిరుత్సాహానికి గురయ్యాను.
undefined
ఇది చాలాసార్లు నాకు ఎదురైన అనుభవమే కానీ, ఈసారి పిలుపు వస్తుందని బాగా ఎక్స్‌పెక్ట్ చేయడంతో తట్టుకోలేకపోయాను.. అయితే అప్పుడు రోహిత్ భయ్యా నాకు సపోర్ట్‌గా నిలిచాడు...
undefined
టీమిండియాలో ఆడినా, ఆడకపోయినా ముంబై ఇండియన్స్‌లో నీకు ఎప్పుడూ చోటు ఉంటుందని భరోసా ఇచ్చాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్...
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, శ్రీలంక టూర్‌లో కీలకంగా మారనున్నాడు. అలాగే టీ20 వరల్డ్‌కప్ జట్టులో కూడా సూర్యకుమార్ యాదవ్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది..
undefined
click me!