IPL 2021: ఆఖరి టెస్టులా క్యాన్సల్ చేస్తారా... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఘాటు కామెంట్...

First Published Sep 22, 2021, 5:30 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్ 2లో కరోనా కలకలం రేగింది. యూఏఈలో సరిగ్గా మూడంటే మూడు మ్యాచులు సజావుగా జరిగాయో లేదో, నాలుగో మ్యాచ్‌కి ముందు కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది... అయితే పాజిటివ్ కేసు వచ్చినా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ సజావుగా జరుగుతుందని తేల్చి చెప్పింది ఐపీఎల్ యాజమాన్యం...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో సెప్టెంబర్ 22న ఉదయం 5 గంటలకు చేసిన కరోనా పరీక్షల్లో నటరాజన్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది...

నట్టూతో పాటు అతనితో క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్న కారణంగా క్రికెటర్ విజయ్ శంకర్, మరో ఐదుగురు సహాయక సిబ్బందిని ఐసోలేషన్‌లో చేర్చిన అధికారులు... మిగిలిన ప్లేయర్లకు చేసిన పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ రావడంతో మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుందని తెలియచేశారు...

అయితే ఐపీఎల్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావడంతో కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లకు టీమిండియాను ట్రోల్ చేయడానికి మరో అకాశం దొరికినట్టైంది...

భారత బృందంలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఇంగ్లాండ్ టూర్‌లో మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టును రద్దు చేసుకుని, అర్ధాంతరంగా యూఏఈ చేరుకున్నారు భారత క్రికెటర్లు...

అందుకే ఐపీఎల్‌లో కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూడడంతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్, ఐపీఎల్ గురించి కామెంట్ చేశాడు...

Michael Vaughan

‘ఆఖరి టెస్టు రద్దు చేసుకున్నట్టే ఐపీఎల్‌ను కూడా రద్దు చేసుకుంటారేమో చూద్దాం... అలా చేయరని నేను గ్యారెంటీ ఇస్తా...’ అంటూ ట్వీట్ చేశాడు మైకెల్ వాగన్...

నాలుగో టెస్టు సమయంలో భారత హెడ్‌కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ రాగా, ఆ తర్వాతి రోజు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లతో పాటు ఫిజియోథెరపిస్ట్ కూడా కరోనా బారినపడ్డారు...

ఐదో టెస్టు ఆరంభానికి ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మర్ కూడా కరోనా బారిన పడడంతో అతనితో క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్న భారత క్రికెటర్లు, కరోనా భయంతో ఐదో టెస్టు ఆడడానికి ఇష్టపడలేదు...

ఆటగాళ్ల సంక్షేమం దృష్ట్యా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపిన బీసీసీఐ... మాంచెస్టర్ టెస్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది...

అయితే ఐదో టెస్టు రద్దు చేయడానికి ఐపీఎల్ 2021 ఫేజ్ 2 మ్యాచులు దగ్గర పడుతుండడమే కారణమని, అందుకే ఆఖరి టెస్టు రద్దు కాగానే భారత క్రికెటర్లు వెంటనే యూఏఈ బయలుదేరుతున్నారని కామెంట్ చేశాడు మైకెల్ వాగన్...

అర్ధాంతరంగా భారత క్రికెటర్లు ఐదో టెస్టు రద్దు చేసుకోవడంతో ఇంగ్లాండ్ బోర్డుకి దాదాపు రూ.200 కోట్ల నష్టం వచ్చింది. ఈ సంఘటనతో అలిగిన ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఫేజ్ 2లో పాల్గొనడం లేదని తెలిపారు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో పాటు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ డేవిడ్ మలాన్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ క్రిస్ వోక్స్... ఆఖరి నిమిషంలో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

click me!