మూలుగుతున్న నక్కపై అదేదో పడ్డట్టు... అసలే ఆఖరి పొజిషన్‌లో ఉన్న సన్‌రైజర్స్‌కి...

First Published Sep 22, 2021, 5:01 PM IST

IPL 2021: పెద్దగా స్టార్ ప్లేయర్లు లేకపోయినా, డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ సోలో పర్ఫామెన్స్‌లతో ఐపీఎల్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లలో ఒకటిగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ప్రతీ జట్టుకూ ఓ బ్యాడ్ ఫేజ్ ఉన్నట్టే, ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీ ఆఖరి పొజిషన్‌ కోసం పోటీలో నిలిచింది...

ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఏదీ కలిసిరాలేదు... ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో బ్యాటింగ్‌లో రాణించినా, మనీశ్ పాండే కాస్త బెటర్ పర్ఫామెన్సే ఇచ్చినా... గెలవాల్సిన మ్యాచుల్లో కూడా చిత్తుగా ఓడింది ఆరెంజ్ ఆర్మీ...

కొన్ని మ్యాచుల్లో అయితే డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి, విజయం అంచుల దాకా తీసుకొచ్చి పెడితే... మిడిల్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ కావడంతో ఓటమి చెందాల్సి వచ్చింది...

అన్నింటికీ మించి ఆరు మ్యాచుల తర్వాత జట్టు కెప్టెన్‌ని మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం...

ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్‌కి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌ను కాదని, 2018లో ఫైనల్ చేర్చిన కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది...

ఈ సంచలన నిర్ణయం తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫేజ్ 2 ఓ ఫైనల్ ఫైట్ లాంటిది. ఇక్కడ జరిగే ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే, ఎస్‌ఆర్‌హెచ్‌కి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్, సన్‌రైజర్స్‌కి కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది...

మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టు... అసలే ఆఖరి పొజిషన్‌లో ఉండి కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై నటరాజన్ దూరం కావడం మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది... ఢిల్లీతో మ్యాచ్‌కి ముందు నటరాజన్‌ కరోనా బారిన పడడంతో ఆరెంజ్ ఆర్మీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

అయితే అతనితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న విజయ్ శంకర్, ఐసోలేషన్‌కి వెళ్లడం ఎస్‌ఆర్‌హెచ్‌కి కలిసొచ్చే అంశం... ఎందుకంటే విజయ్ శంకర్ మ్యాచ్‌ని గెలిపించిన సందర్భాల కంటే, గెలిచే మ్యాచ్‌ను ఓటమి దిశకు పంపించిన సందర్భాలే ఎక్కువ...

ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ రషీద్‌ ఖాన్‌కి మంచి రికార్డు ఉంది. ఢిల్లీతో జరిగిన 11 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు రషీద్ ఖాన్...

వికెట్ల కంటే ముఖ్యంగా 5.63 ఎకానమీతో బౌలింగ్ చేసి, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టాడు. ఈ రెండు జట్ల మధ్య ఫస్టాఫ్‌లో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసి... ఢిల్లీకి విజయం దక్కింది...

click me!