విరాట్ కోహ్లీ నా కంటే చాలా టాలెంటెడ్... సౌరవ్ గంగూలీ కామెంట్స్ వైరల్...

Published : Sep 10, 2022, 07:32 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి విరాట్ కోహ్లీని సెలక్ట్ చేయడమే కరెక్ట్ కాదన్నారు చాలామంది క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆసియా కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ... ఈ ఇన్నింగ్స్‌తో భారత మాజీ సారథిపై ప్రశంసల వర్షం కురుస్తోంది...

PREV
16
విరాట్ కోహ్లీ నా కంటే చాలా టాలెంటెడ్... సౌరవ్ గంగూలీ కామెంట్స్ వైరల్...

5 మ్యాచుల్లో 92 సగటుతో 276 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఆసియా కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. అయితే రెండో స్థానంలో ఉన్న పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఫైనల్ మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేస్తే... కోహ్లీని అధిగమిస్తాడు.

26
virat kohli

1020 రోజులుగా సెంచరీ మార్కు అందుకోలేక తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 71వ సెంచరీని అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొట్టమొదటి శతకాన్ని బాదిన విరాట్ కోహ్లీ... సురేష్ రైనా, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తర్వాత మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు..

36

తాజాగా విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు బీసీసీఐ ప్రెసిడెంట్, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. ‘ప్లేయర్లను వారి స్కిల్స్ ఆధారంగా పోల్చాలి.  అలా చూసుకుంటే నా కంటే విరాట్ కోహ్లీ చాలా టాలెంటెడ్. కాకపోతే ఇన్ని సెంచరీలు రావు కదా...

46

మీ ఇద్దరం వేర్వేరు తరాల్లో ఆడాం. నేను కూడా చాలా క్రికెట్ ఆడాను. అయితే నా తరంలో నేను ఆడిన విధానం వేరు. అతను ఇంకా ఆడుతూనే ఉన్నాను. నా కంటే ఎక్కువ మ్యాచులే ఆడతాడ... అయితే ఇప్పటికైతే అతని కంటే నేనే ఎక్కువ మ్యాచులు ఆడాను...

56

విరాట్ నేను ఆడిన మ్యాచుల కంటే ఎక్కువే ఆడతాడు. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. మీడియా అప్పుడు కూడా చాలా వార్తలు రాసింది నా గురించి. అయితే వాటిల్లో సగం కూడా నాకు తెలీదు. 

66
Ganguly-Kohli

నేను హోటల్‌కి వెళ్లగానే, రిసెప్షన్‌కి వెళ్లి, నా రూమ్‌లో పేపర్ వేయొద్దని చెప్పేవాడిని... ఇప్పుడు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

Read more Photos on
click me!

Recommended Stories