ఇన్నేళ్లుగా మూడు ఫార్మాట్లు ఆడుతున్నానంటే కారణం అదే... రాహుల్ ద్రావిడ్‌‌తో విరాట్ కోహ్లీ...

Published : Mar 14, 2023, 12:16 PM IST

మూడేళ్ల పాటు డార్క్ పీరియడ్‌ని అనుభవించిన విరాట్ కోహ్లీ, 2022 ఆగస్టు నుంచి మళ్లీ పూర్వ వైభవం అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, బోర్డర్ గవాస్కర్ 2023 టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు..  

PREV
16
ఇన్నేళ్లుగా మూడు ఫార్మాట్లు ఆడుతున్నానంటే కారణం అదే... రాహుల్ ద్రావిడ్‌‌తో విరాట్ కోహ్లీ...

మొదటి మూడు టెస్టుల్లో 50+ స్కోరు కూడా చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, అహ్మదాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేసి.. కెరీర్‌లో 28వ టెస్టు సెంచరీ అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్న విరాట్‌ కోహ్లీని స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...
 

26

‘ప్రతీ మ్యాచ్ ఇలా ఇంత సుదీర్ఘంగా ఆడాలంటే కష్టం. పరిస్థితులకు తగ్గట్టుగా నా ఆటను మార్చుకుంటూ ఉంటాను. అందుకే ఇన్నేళ్లుగా మూడు ఫార్మాట్లు ఆడగలుగుతున్నా.. ఏ మ్యాచ్‌కి ఎలాంటి ఆట కావాలో మనం అర్థం చేసుకుంటే చాలు...

36
Image credit: PTI

మెంటల్‌గా ఆటకు నేను సిద్ధమైనా, ఫిజికల్‌గా నా శరీరం నుంచి సరైన సహకారం రాకపోతే ఏమీ చేయలేను. అందుకే ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తాను. ఒకే ఓవర్‌లో 6 సార్లు డబుల్స్ తీయడానికైనా... అలా ఏడు ఓవర్ల పాటు సింగిల్స్ తీస్తూ పరుగెత్తడానికైనా నేను సిద్ధంగా ఉండాలి..

46
Image credit: PTI

అది కేవలం మెంటల్ ప్రిపరేషన్ వల్ల అయ్యే పని కాదు, ఫిజికల్‌గా కూడా ఫిట్‌గా ఉండాలి. నేను మెంటల్ ఫిట్‌నెస్‌తో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి ఇదే కారణం. మిడ్ వికెట్ మీదుగా బౌండరీలు కొట్టాల్సిన అవసరం ఈ మ్యాచ్‌లో కనిపించలేదు...

56
Image credit: PTI

అలాంటి రిస్క్ తీసుకుంటే టీమ్ కూడా రిస్క్‌లో పడుతుంది. అందుకే ఎంత ఎక్కువ సేపు వీలైతే అంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని అనుకున్నా. నేను 50 చేసినా, 100 చేశానా అనేది ముఖ్యం కాదు.. నేను చేసిన పరుగులు టీమ్‌కి ఎంత అవసరమయ్యాయనే విషయం ఒక్కటే ఆలోచిస్తా... 

66
Image credit: PTI

భిన్నమైన పరిస్థితుల్లో భిన్నమైన వాతావరణంలో భిన్నంగా బ్యాటింగ్ చేయగలగడం నాకున్న ప్రత్యేకత. ఎందుకంటే నేను అవసరమైతే పవర్ హిట్టింగ్ చేయగలను, లేదంటే సింగిల్, డబుల్స్ తీస్తూ క్రీజులో గంటలు గంటలు బ్యాటింగ్ చేయగలను...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ..

Read more Photos on
click me!

Recommended Stories