బుమ్రా అలా చేస్తే గాయం నుంచి బయటపడొచ్చు! ఉమ్రాన్ మాలిక్ ఫ్యూచర్ సూపర్ స్టార్... బ్రెట్ లీ కామెంట్..

Published : Mar 14, 2023, 10:13 AM IST

46 ఏళ్ల వయసులోనూ తన బౌలింగ్‌లో పదును ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో వరల్డ్ జెయింట్స్ టీమ్ తరుపున ఆడుతున్న బ్రెట్ లీ, టీమిండియా ప్లేయర్లు జస్ప్రిత్ బుమ్రా, ఉమ్రాన్ మాలిక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..

PREV
16
బుమ్రా అలా చేస్తే గాయం నుంచి బయటపడొచ్చు! ఉమ్రాన్ మాలిక్ ఫ్యూచర్ సూపర్ స్టార్...  బ్రెట్ లీ కామెంట్..
Image credit: PTI

‘ఉమ్రాన్ మాలిక్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. టెస్టుల్లో అతన్ని ఆడిస్తే బాగుంటుంది. అతనికి చక్కని పేస్ ఉంది, అంతకుమించి మంచి యాక్షన్ ఉంది. లైన్ అండ్ లెంగ్త్ పైన కూడా పట్టు సాధించాడు...

26
Umran Malik

అతన్ని టెస్టుల్లో ఆడిస్తే, టీమిండియాకి ఓ సూపర్ స్టార్ తయారవుతాడు. ఉమ్రాన్ మాలిక్ ఈజీగా 150+ కి.మీ.ల వేగం అందుకుంటున్నాడు. అతను చాలా అరుదైన ప్లేయర్. సరిగ్గా వాడుకోవడం తెలియాలంతే..

36
Jasprit Bumrah

జస్ప్రిత్ బుమ్రా తన బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే, ఇలా తరుచూ గాయపడకుండా ఉంటాడు. మొత్తంగా బౌలింగ్ మార్చుకోవాలని అనడం లేదు. బుమ్రాకి అద్భుతమైన రికార్డు ఉంది. అయితే వెన్ను నొప్పితో బాధపడుతూ ఫాస్ట్ బౌలర్‌గా కొనసాగడం చాలా కష్టం...

46
Image credit: Getty

అయితే అతని రన్నప్‌ని తక్కువ చేసుకుంటే ఈ సమస్య నుంచి కాస్త బయటపడవచ్చు. చాలా దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేకంటే, తక్కువ దూరం రన్నప్‌తో తక్కువ ఎనర్జీతో ఎక్కువ రిజల్ట్ రాబట్టవచ్చు. బుమ్రా, దీనిపైన ఫోకస్ పెట్టాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ...
 

56
bumrah

గాయంతో ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లో ఆడని జస్ప్రిత్ బుమ్రా, ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు ఆ తర్వాత జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా దూరమయ్యాడు...

66
Umran Malik

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, 157 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో 13, వన్డేల్లో 11 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్.. టెస్టుల్లో ఇప్పటిదాకా ఆరంగ్రేటం చేయలేదు.. 

click me!

Recommended Stories