విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఆడడంలో తెలియని కిక్ ఉంటుంది... శార్దూల్ ఠాకూర్ కామెంట్స్...

First Published Sep 18, 2021, 1:01 PM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన గత 9 టీ20 సిరీస్‌ల్లో విజయాలను అందుకుంది టీమిండియా. ఈ టీ20 సిరీసుల్లో 17 వికెట్లు తీసి, టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్న శార్దూల్ ఠాకూర్, విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై స్పందించాడు...

‘విరాట్ కోహ్లీ నిర్ణయం నాకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగితే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే విరాట్ కెప్టెన్సీలో కొన్నేళ్లుగా టీమిండియా అదరగొడుతోంది...

అతని కెప్టెన్సీలో ఆడడంలో తెలియని కిక్ ఉంటుంది. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, వారి సామర్థ్యాలపై భరోసా ఉంచుతాడు విరాట్ కోహ్లీ... అతని దృష్టిలో టీ20 కెప్టెన్‌గా తప్పుకోవడానికి ఇదే సరైన సమయమేమో...

ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీతో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు. టీ20 కెప్టెన్‌గా విరాట్ సాధించినదానికి అభినందనలు తెలపాలని అనుకుంటున్నా... 

ఈ టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాతే కోహ్లీతో మాట్లాడే అవకాశం రావచ్చు. అప్పటిదాకా విరాట్ మా కెప్టెనే...’ అంటూ చెప్పుకొచ్చాడు శార్దూల్ ఠాకూర్...

‘టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డాను. టీ20 వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఏ ప్లేయర్‌కైనా గర్వకారణంగా ఉంటుంది...

ఓవల్ టెస్టులో నా పర్ఫామెన్స్ చూస్తే, రెడ్ బాల్ క్రికెట్‌లోలాగే వైట్ బాల్ క్రికెట్‌లోనూ ఆడగలనని అర్థమయ్యే ఉంటుంది. రెండేళ్లుగా రెండు ఫార్మాట్లపైనా పూర్తి దృష్టి పెట్టా...

వరల్డ్‌కప్‌లో రిజర్వు ప్లేయర్‌గా చోటు దక్కింది. ఎప్పుడైనా టీమిండియా నుంచి నా పిలుపు వస్తుందని నమ్మకంగా ఉన్నా...’ అంటూ కామెంట్ చేశాడు శార్దూల్ ఠాకూర్..
 

click me!