ఆ విషయంలో నేను సూపర్ సక్సెస్ అయ్యా... టీమిండియా హెడ్‌కోచ్ పదవిపై రవిశాస్త్రి కామెంట్స్...

First Published Sep 18, 2021, 11:33 AM IST

నాలుగేళ్లుగా టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవిశాస్త్రి, కాంట్రాక్ట్ గడువు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో ముగియనుంది. ఈ నాలుగేళ్ల ప్రస్థానం చాలా సంతృప్తికరంగా సాగిందంటున్నాడు రవిశాస్త్రి...

2017లో అనిల్ కుంబ్లే అర్ధాంతరంగా హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత, ఆ బాధ్యతలు స్వీకరించాడు రవిశాస్త్రి. విరాట్ కోహ్లీకి, రవిశాస్త్రికి మంచి రాపో కుదరడంతో 2019లోనూ తిరిగి హెడ్‌కోచ్‌గా అపాయింట్ అయ్యాడు...

‘నేను సూపర్ సక్సెస్ అయ్యాననే నమ్ముతున్నా... ఎందుకంటే ఈ ఐదేళ్లలో టెస్టుల్లో టీమిండియా నెం.1 ర్యాంకులో కొనసాగింది.. ఆస్ట్రేలియాలో రెండుసార్లు టెస్టు సిరీస్ గెలిచాం, ఇంగ్లాండ్‌లో విజయాలు అందుకున్నాం...

కరోనా సమయంలో అనేక ఇబ్బందులను అధిగమించి  ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించి టెస్టు సిరీస్ గెలవడం, ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో రెండు టెస్టుల్లో ఓడించడం నాకు చాలా స్పెషల్...

వైట్ బాల్ క్రికెట్‌లో ప్రతీ దేశంపైనా, వారి సొంతగడ్డపైనే ఓడించి టీ20 సిరీస్‌లు గెలిచాం... టీ20 వరల్డ్‌కప్ టోర్నీ కూడా గెలిస్తే... నాకు అంతకుమించిన గర్వకారణం ఏముంటుంది...

నేను ఇప్పటికే సాధించాల్సినదంతా సాధించాను. అందుకే ఇక ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా... ఎందుకంటే గౌరవం ఉన్న చోట, ఎక్కువకాలం ఉండకూడదని నమ్ముతాను...

ఐసీసీ ట్రోఫీ గెలవడానికి మేం ఏం చేయగలమో అంతా చేశాం, టీ20 వరల్డ్‌కప్‌లోనూ అదే చేస్తాం. విజయాల కంటే ఎక్కువగా మేం ఆటను పూర్తిగా ఎంజాయ్ చేస్తాం... టీ20ల్లో ఈ మజా మరింత ఎక్కువగా ఉంటుంది...

కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడం కాస్త బాధగా కూడా ఉంది. ఎందుకంటే గొప్ప గొప్ప ప్లేయర్లు, పర్సనాలిటీలతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోతున్నా... డ్రెస్సింగ్ రూమ్‌లో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోను...

జస్ప్రిత్ బుమ్రా టెస్టుల్లో రాణించగలడని ఎవ్వరూ నమ్మలేదు. అయితే అతని సత్తాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. విదేశీ పిచ్‌లపై 20 వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్లను తయారుచేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నా...

2018 సౌతాఫ్రికా టూర్‌లో ఈ ప్రయోగాలకు శ్రీకారం చుట్టాం. మేం పోరాడినా, ఆ సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయాం. కానీ బుమ్రా నుంచి మేం ఆశించామో, కేప్‌టౌన్ టెస్టులో దాన్ని రాబట్టగలిగాం...

స్వదేశాల్లో బుమ్రాని ఆడించకూడదని నేనే చెప్పా. మూడేళ్ల తర్వాత ఇప్పుడు అతను 101 వికెట్లు తీశాడు. అది రికార్డు వేగంతో...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత హెడ్‌కోచ్ రవిశాస్త్రి...

click me!