ఈసారి తగ్గేదే లేదు... ఐపీఎల్ పర్ఫామెన్స్‌పై ఛతేశ్వర్ పూజారా...

First Published Apr 4, 2021, 3:24 PM IST

2014లో చివరిసారిగా ఐపీఎల్ ఆడిన టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున బరిలో దిగబోతున్న నయా వాల్, ఐపీఎల్‌లో బ్యాటింగ్ ఎలా చేస్తాడోనని ఆసక్తి నెలకొంది. అయితే టెస్టు బ్యాట్స్‌మెన్ అయినా ఐపీఎల్‌లో తగ్గేదే లేదంటున్నాడు పూజారా...

‘ప్రస్తుత క్రికెట్‌లో వికెట్‌కి విలువ తగ్గిపోయింది. స్టైయిక్ రేటుకి బాగా క్రేజ్ పెరిగింది. ఎంత సేపు క్రీజులో ఉన్నామనే విషయం కంటే, ఎన్ని పరుగులు చేశామనేదానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు...
undefined
నాకు ఈ ఫార్మాట్ సెట్ కాదని చాలామంది అభిప్రాయం. కానీ నేను అన్ని ఫార్మాట్లు ఆడగలనని నిరూపించుకోవాలని అనుకుంటున్నా. దాన్ని సాధించడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు...
undefined
కఠినమైన శ్రమ, క్రమశిక్షణ, అంకిత భావం... ఇవి ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ఓ ప్లేయర్‌గా నేనేం చేయాలో అది చేస్తాను. స్టైయిక్ రేటు గురించి మాట్లాడితే నేను పవర్ హిట్టర్‌ని కాదు, అది నాకు కూడా తెలుసు...
undefined
కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ నుంచి నేను చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా రోహిత్ శర్మ కూడా అద్భుతమైన పవర్ హిట్టర్ కాదు, కానీ అంతకుమించి టైమింగ్ బాగా తెలిసిన టెక్నిక్ ఉన్న ప్లేయర్...
undefined
నేను చూసిన బెస్ట్ టైమింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ... వీళ్లేకాకుండా కేన్ విలియంసన్, స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్‌మెన్ అన్ని ఫార్మాట్లలోనూ రాణించగలమని నిరూపించుకుననారు...
undefined
కొత్త కొత్త షాట్స్‌ను ఆవిష్కరిస్తూ, అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న క్రికెటర్ల లాగే నేను నిరూపించుకుంటా... కొన్ని ఏళ్ల క్రితమే రాహుల్ ద్రావిడ్ నాకు ఓ సలహా ఇచ్చాడు... నేను ఇప్పుడు దాన్ని చెప్పాలనుకుంటున్నా...
undefined
డిఫెరెంట్ షాట్స్ ఆడినంత మాత్రాన మన సహజమైన ఆటతీరు మారిపోతుందని కాదు... అని చెప్పాడు ద్రావిడ్... నేను ఆడినా, ఆడకపోయినా చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ప్లేఆఫ్ చేరడం ఖాయం...
undefined
మాహీ భాయ్ కోచ్‌ల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నా. నాపైన ఎక్కువగా అంచనాలు లేవు. అందుకే నా వల్ల అయ్యిందేదో నేను చేసి చూపిస్తాను...’ అంటూ వ్యాఖ్యానించాడు ఛతేశ్వర్ పూజారా...
undefined
click me!