భారతీయుడిగా గర్విస్తున్నా! ఇన్‌స్టాలో డీపీ మార్చిన మాహీ... ధోనీ ఏం చేసినా వార్తే!

First Published | Aug 14, 2022, 1:06 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇన్‌స్టాగ్రామ్‌లో తన డీపీని మార్చేశాడు. ఓరి నీ... ఇది కూడా ఓ వార్తేనా! అని చాలామంది అనుకోవచ్చు. అయితే మాహీ ఏం చేసినా వార్తే మరి. టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి మాస్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది...

చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగు ఐపీఎల్ టైటిల్స్ అందించిన మాహీ, సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టీవ్‌గా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే 2020-21లో భారత జట్టు ఆడిలైడ్ టెస్టులో 36/9 ఘోర పరాభవం తర్వాత ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్ కైవసం చేసుకుంది...

32 ఏళ్లుగా పరాజయం ఎరుగని గబ్బాలో ఆస్ట్రేలియాని చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత ఆసీస్ క్రికెటర్లు కూడా టీమిండియా ఆటతీరును అద్భుతమంటూ ప్రశంసించారు. అయితే మాహీ మాత్రం ఓ ట్వీట్ కానీ, సోషల్ మీడియాలో ఓ పోస్టు కానీ వేయలేదు. ఆ తర్వాత వారానికి ఓ బ్రాండ్ ప్రమోషన్ పోస్టు మాత్రం పెట్టాడు ధోనీ...


ఇంకా చెప్పాలంటే మాహీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు కానీ, రిప్లబిక్ డే విషెస్ కానీ చెప్పడు. తన సోషల్ మీడియా ఖాతాలను కేవలం తన ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను మార్గెటింగ్ చేయడానికి, బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రమోషన్లు చేయడానికి మాత్రమే కొన్నాళ్లుగా వాడుతూ వస్తున్నాడు మాహీ...

dhoni Instagram

అలాంటి మహేంద్రుడు, ఇప్పుడు ఇన్‌స్టాలో డీపీ మార్చడం హాట్ టాపిక్ అయ్యింది. భారత ప్రభుత్వం ‘హార్ ఘర్ తిరంగ’ (ప్రతీ ఇంట్లో త్రివర్ణ జెండా’ పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో అందరూ భారత జెండాని డీపీగా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు...
 

ms dhoni

దీంతో మాహీ కూడా తన డీపీని మార్చేశాడు. ‘నేను భారతీయుడిగా గర్విస్తున్నా...’ అనే స్లోగన్‌తో భారతీయ జెండా ఉన్న పిక్‌ను ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టనెంట్ ర్యాంక్ హోదా పొందిన మహేంద్ర సింగ్ ధోనీ, పారాట్రూపర్‌గానూ అర్హత సాధించాడు...
 

dhoni dp

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడని మహేంద్ర సింగ్ ధోనీ, 2020 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజునే రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రిటైర్మెంట్ తర్వాత మాహీ మిలటరీలో పనిచేస్తాడని వార్తలు వినిపించినా, ఆర్గానిక్ వ్యవసాయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు...

Dhoni

మహేంద్ర సింగ్ ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా వంటి క్రికెటర్లు కూడా భారత త్రివర్ణ పతకాన్ని డీపీగా పెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం విశేషం...

Latest Videos

click me!