ఊర్వశికి కౌంటర్ ఇస్తూనే.. ఇక లాభం లేదంటున్న పంత్.. వాటిని నియంత్రించలేమంటూ..!

Published : Aug 14, 2022, 12:43 PM IST

Rishabh Pant - Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెల, టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్  మధ్య గత కొన్నిరోజులుగా  సోషల్ మీడియా వేదికగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.   

PREV
16
ఊర్వశికి కౌంటర్ ఇస్తూనే.. ఇక లాభం లేదంటున్న పంత్.. వాటిని నియంత్రించలేమంటూ..!

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్-బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెల లు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణల పర్వం ఇంకా ముగియలేదు.  ఊర్వశి ఇంటర్వ్యూతో మొదలైన ఈ రచ్చ.. ఇంకా కొనసా.....గుతూనే ఉంది.

26

రాఖీ పండుగ రోజున రిషభ్ పంత్ పేరును ప్రస్తావించుకుండా అతడిని ‘ఆర్‌పీ భయ్యా’ అని సంబోధిస్తూ  ఊర్వశి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనమీద నిందలు మోపడం మాని క్రికెట్ ఆడుకుంటే మంచిదని సూచించింది. నిశ్శబ్దంగా ఉన్నాను కదా అని తన మీద అవాకులు చెవాకులు పేలితే ఇక్కడ  చూస్తూ ఎవరూ కూర్చోరని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది.

36

ఈ కామెంట్స్ పై రిషభ్  ఏం స్పందిస్తాడా..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా అతడు తన ఇన్స్టా స్టోరీలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘మనం నియంత్రించలేని విషయాలమీద ఎక్కువగా ఒత్తిడికి గురికావొద్దు..’ అని  ఓ కోట్ ను పంచుకున్నాడు.

46

ఈ కొటేషన్ ఊర్వశిని ఉద్దేశిస్తూ  పెట్టాడన్నది బహిరంగ రహస్యమే. ఇప్పటికే రచ్చ రచ్చ అయిన ఈ వివాదాన్ని ఇంకా లాగడం కంటే  వీలైనంత త్వరగా దీనిని కట్ చేయడమే ఉత్తమమని పంత్ భావించి ఉంటాడని, అందుకే  ఈ కొటేషన్ పెట్టి ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  భావి భారత సారథిగా ఎదుగుతున్న పంత్..  ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం కంటే తప్పుకోవడమే ఉత్తమమని ఫ్యాన్స్ కోరుతున్నారు.

56

పంత్ తాజా పోస్ట్ కూడా ఇదే సూచిస్తున్నది.  ఈ ఇద్దరూ ఒకరి పేరు ఒకరు చెప్పుకోకపోయినా ఈ వివాదం నడుస్తున్నదే ఈ ఇద్దరి మధ్య అని అందరికీ తెలిసింది. మొదలు ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో రిషభ్ (ఆర్‌పీ) తాను విడిపోవడానికి గల కారణాలను వివరిస్తూ వ్యాఖ్యలు చేయడం.. వాటికి పంత్ స్పందించడం.. మళ్లీ వాటిపై ఊర్వశి  కౌంటర్ ఇవ్వడం.. అదేదో సినిమాలో చెప్పినట్టు అంతా కమ్ అండ్ గో లా జరిగిపోయింది.

66

మరి పంత్ చేసిన ఈ పోస్ట్ తో ఈ మాజీ ప్రేమికుల సోషల్ మీడియా వార్ కు ఎండ్ కార్డ్ పడినట్టేనా..? లేక  ఇంకా తెలుగు సీరియల్ లా కొనసా...గింపు ఉంటుందా..? అనేది కొద్దిరోజుల్లో తేలనుంది.

Read more Photos on
click me!

Recommended Stories