ధోనీ, ఆ రోజు చెప్పిన మాటలు ఎప్పటికీ.. భారత జట్టుకి ఎంపికైన మహిళా వికెట్ కీపర్ ఇంద్రాణీ రాయ్...

First Published May 17, 2021, 12:21 PM IST

టీమిండియా మహిళా జట్టు, వచ్చే నెలలో ఇంగ్లాండ్‌కి వెళ్లనుంది. ఈ టూర్‌లో ఓ టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌కి ఎంపికైన వికెట్ కీపర్ బ్యాట్స్‌వుమెన్ ఇంద్రాణీ రాయ్, తనకి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన సలహాలు ఎంతో మేలు చేశాయని చెప్పుకొచ్చింది...

దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ఇంద్రాణీ రాయ్, సీనియర్ వన్డే పోటీల్లో 456 పరుగులతో ఆకట్టుకుంది. వెస్ట్ బెంగాల్‌కి చెందిన కొన్నేళ్ల క్రితం జార్ఖండ్‌కి మకాం మార్చింది... జార్ఖండ్‌ నుంచి దేశానికి ప్రాతినిథ్యం వహించిన ధోనీతో సంభాషణ తనకెంతో మేలు చేసిందంటోంది ఇంద్రాణీ..
undefined
‘గత ఏడాది రాంఛీలో ట్రైయినింగ్ సెషన్స్‌లో పాల్గొంటున్నప్పుడు మాహీ సర్ కూడా అక్కడికి వచ్చారు. ఆయనకు వీరాభిమానిని అయిన నేను, మాహీతో చాలాసేపు మాట్లాడాను. ఆయన కూడా ఎలాంటి విసుగు లేకుండా మాకు చాలా విలువైన సలహాలు ఇచ్చారు..
undefined
వికెట్ల వెనకాల ఎలా కదలాలి, ఐదు మీటర్ల రేడియస్‌ను ఎలా కవర్ చేయాలనే విషయాలను మాహీ సర్ వివరించారు. వికెట్ల కీపర్లకు ఇది చాలా కీ పాయింట్. ఆయన వికెట్ల వెనక కదిలే వేగాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని సూచించారు...
undefined
మాహీ చెప్పిన సలహా నాకెంతో ఉపయోగపడింది. నేను క్రీజులో అడుగుపెట్టిన ప్రతీసారీ మాహీ సర్ చెప్పిన సలహాలను గుర్తు చేసుకుంటూ ఉంటాను...
undefined
భారత జట్టు నుంచి తొలిసారి నాకు పిలుపు వచ్చింది. దీని వెనక నేను పడిన కష్టం ఎంతో ఉంది. సీనియర్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడానికి, వారి నుంచి ఎంతో విలువైన పాఠాలు నేర్చుకోవడానికి ఎదురుచూస్తున్నా...
undefined
ఇది నా మొట్టమొదటి అంతర్జాతీయ టోర్నీ, నాకు తుది జట్టులో అవకాశం వస్తే, నా బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి నూటికి నూరుశాతం ప్రయత్నిస్తా...’ అంటూ చెప్పుకొచ్చాడు 23 ఏళ్ల ఇంద్రాణీ రాయ్.
undefined
click me!