జాతీయ జట్టు తరఫున ఆడి మంచి ప్రదర్శనలివ్వడం, నా దేశం కోసం శక్తి మేర కృషి చేయడానికే నేను తొలి ప్రాధాన్యమిస్తాను. అందుకే నేను ఈ లీగ్ క్రికెట్ ను పక్కనబెట్టాను. అదీగాక ఆసీస్ తరఫున మేం తీరిక లేని క్రికెట్ ఆడుతున్నాం. రాబోయే 18 నెలలలో మాకు ఊపిరిసలపని షెడ్యూల్ ఉంది. నేనెప్పుడూ ఆస్ట్రేలియాకు ఆడటానికే ప్రాధాన్యం ఇస్తాను.