లక్షా 30 వేల మంది మధ్య ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్... రిజల్ట్ తేడా వస్తే అహ్మదాబాద్‌లో అరాచకమే...

Published : Jun 27, 2023, 01:35 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ షెడ్యూల్‌ని ఎట్టకేలకు విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఈ షెడ్యూల్‌లో టీమిండియా ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్...

PREV
110
లక్షా 30 వేల మంది మధ్య ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్... రిజల్ట్ తేడా వస్తే అహ్మదాబాద్‌లో అరాచకమే...
India vs Pakistan

అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడే టీమిండియా, అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడి... అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో దాదాపు 1 లక్షా 32 వేల మంది అభిమానుల మధ్య దాయాదుల సమరం జరగనుంది..

210

ఐసీసీ వరల్డ్ కప్‌లో టీమిండియాకి పాకిస్తాన్‌పై ఘనమైన రికార్డు ఉంది. అయితే 2021 టీ20 వరల్డ్ కప్‌లో మొదటిసారి ఇండియాపై వరల్డ్ కప్ విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. దీంతో ఈసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌పై విపరీతమైన హైప్ ఏర్పడింది..

310
India vs Pakistan

2022 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో గట్టెక్కిన టీమిండియా, 2023 వన్డే వరల్డ్ కప్‌లో గెలిచి... ఆ ఆధిపత్యాన్ని కొనసాగించాలని అనుకుంటోంది. వరల్డ్ కప్‌కి ముందు ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.

410

అయితే శ్రీలంకలో జరిగే ఆ మ్యాచ్ గురించి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అయినా లంకలో ఇండియా- పాక్ జరగడం వేరు, ఇండియాలో దాయాదుల పోరు జరగడం వేరు.

510

ఇండియాలో అదీ అహ్మదాబాద్‌లో లక్షన్నర మంది మధ్య జరిగే మ్యాచ్‌లో రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా... విపరీత పరిణామాలను చూడాల్సి రావచ్చు..

610

ఇప్పటికే భారత జట్టు వరుసగా ఐసీసీ టోర్నీల్లో ఫెయిల్ అవుతుండడంతో టీమిండియా ఫ్యాన్స్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. వన్డే వరల్డ్ కప్‌లో మిగిలిన మ్యాచులన్నీ ఓ ఎత్తు అయితే ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ మరో ఎత్తు... పాకిస్తాన్‌ చేతుల్లో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ఓడితే అది డబుల్, త్రిబుల్ అయ్యి... విధ్వంసానికి దిగే ప్రమాదం ఉంది..

710

మరి 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్‌ టోర్నీకి ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ, ఈ మ్యాచ్ విషయంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తుంది, అభిమానులను కంట్రోల్ చేయడానికి ఎంత మంది పోలీసులను మోహరిస్తుందనేది చూడాలి...

810

ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు పాక్ నుంచి కూడా వేల సంఖ్యలో అభిమానులు, అహ్మదాబాద్‌కి వస్తారు. స్టేడియంలో పాక్ ఫ్యాన్స్ అతి చేస్తే, ఇరు దేశాల అభిమానుల మధ్య గొడవలు కూడా జరగొచ్చు..

910

టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాని ఓడించిన పాకిస్తాన్, వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో మాత్రం ఇప్పటిదాకా గెలవలేకపోయింది. 1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్‌ని చిత్తు చేసింది భారత జట్టు..

1010

చివరిగా 2019 వన్డే వరల్డ్ కప్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 89 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా. రోహిత్ శర్మ 113 బంతుల్లో 140 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు..

click me!

Recommended Stories