ఆర్‌సీబీ జట్టులోకి హైదరాబాద్ క్రికెటర్... హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కొడుకు చామ మిలింద్‌కి...

Published : Feb 14, 2022, 03:50 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలంలో హైదరాబాద్ క్రికెటర్లకు కూడా కాసుల వర్షం కురిసింది. హైదరాబాద్ క్రికెటర్, అండర్-19 వరల్డ్ కప్ 2020 ప్లేయర్ తిలక్ వర్మ కోసం నాలుగు ఫ్రాంచైజీలు పోటీపడగా, ముంబై ఇండియన్స్ జట్టు రూ.1.7 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే...

PREV
17
ఆర్‌సీబీ జట్టులోకి హైదరాబాద్ క్రికెటర్... హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కొడుకు చామ మిలింద్‌కి...

హైదరాబాద్ క్రికెటర్ రాహుల్ బుద్ధిని రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేయగా సీవీ మిలింద్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.25 లక్షలకు కొనుగోలు చేసింది...

27

27 ఏళ్ల చామ మిలింద్‌, ఐపీఎల్‌కి ఎంపిక కావడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకుముందు 2015 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2016లో ఢిల్లీ జట్లకు ఎంపికయ్యాడు మిలింద్...

37

లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ అయిన మిలింద్, మరెవ్వరో కాదు... హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ ఆనంద్ కుమారుడు...

47

2013 నుంచి హైదరాబాద్ టీమ్ తరుపున రంజీ ట్రోఫీతో పాటు విజయ్ హాజరే ట్రోపీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీల్లో పాల్గొంటున్నాడు చామ మిలింద్...

57

45 లిస్టు ఏ మ్యాచులు ఆడి 82 వికెట్లు తీసిన చామ మిలింద్, ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో బ్యాటుతోనూ రాణించాడు. 38 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన చామ మిలింద్, ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. 85 వికెట్లు పడగొట్టాడు...

67

దేశవాళీ టీ20 టోర్నీలో 41 మ్యాచులు ఆడిన చామ మిలింద్, 62 వికెట్లు తీసి అదరగొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ల కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంఛైజీలకు మిలింద్‌ మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు...

77

ఐపీఎల్‌ వేలంలో ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, చామ మిలింద్‌ను కేవలం నెట్ బౌలర్‌గా మాత్రమే వాడుతున్నాయి జట్లు. కనీసం ఈసారి అయినా హైదరాబాద్ యంగ్ క్రికెటర్లకు ఐపీఎల్ మ్యాచులు ఆడే అవకాశం వస్తుందో, లేదో చూడాలి...

click me!

Recommended Stories