టెస్టుల్లో టాప్‌లోకి రోహిత్ సేన! న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే టీమిండియాకి లక్కీ ఛాన్స్...

First Published Jan 17, 2023, 4:07 PM IST

ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం టీమిండియా జోరు చూపిస్తోంది. టీ20ల్లో టాప్ ర్యాంకులో దూసుకుపోతున్న భారత జట్టు, టెస్టుల్లోనూ టాప్ ప్లేస్‌కి చేరువవుతోంది. ప్రస్తుతం ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉన్న టీమిండియా 115 పాయింట్లతో ఉంటే, స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగియడంతో ఆస్ట్రేలియా 126 పాయింట్లకు పడిపోయింది...
 

Team India vs SL Mohammad Siraj Celebration

ఇండియాలో ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ని మాత్రమే కాకుండా టెస్టు టాప్ ర్యాంకుని కూడా డిసైడ్ చేయనుంది. ఈ సిరీస్‌ని 3-0 లేదా 4-0 తేడాతో టీమిండియా గెలవగలిగితే, ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టి టాప్‌ ప్లేస్‌కి దూసుకెళ్తుంది...

Team India vs sri lanka

టీ20ల్లో టాప్‌లో ఉన్న టీమిండియాకి, ఇంగ్లాండ్ నుంచి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఇండియా ఖాతాలో 267 పాయింట్లు ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2022 విజేత ఇంగ్లాండ్ ఖాతాలో 266 పాయింట్లు ఉన్నాయి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే టీ20 సిరీస్ గెలిస్తే ఈ ఆధిక్యాన్ని మరింత పెంచుకోగలుగుతుంది భారత జట్టు...

Image credit: PTI

వన్డేల్లో మాత్రం టీమిండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 117 పాయింట్లతో టాప్‌లో ఉంది. ఇంగ్లండ్ 113, ఆస్ట్రేలియా 112 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. నాలుగో స్థానంలో 110 పాయింట్లతో ఉన్న భారత జట్టు, న్యూజిలాండ్‌ని వైట్ వాష్ చేస్తే... టాప్‌కి ఎగబాకుతుంది...

Image credit: PTI

ఈ వన్డే సిరీస్ గెలిస్తే టీమిండియా ఖాతాలోకి 116 పాయింట్లు చేరతాయి. అదే సమయంలో న్యూజిలాండ్ పాయింట్లు కోల్పోతుంది. దీంతో భారత జట్టు టాప్‌లోకి వెళ్తుంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతోనూ వన్డే సిరీస్ ఆడనుంది భారత జట్టు. టాప్‌ ర్యాంకుని నిలబెట్టుకోవాలంటే ఆసీస్‌ని కూడా ఓడించాల్సి ఉంటుంది..

Image credit: PTI

అంటే రెండు సిరీసుల్లో విజయం సాధిస్తే మూడు ఫార్మాట్లలో నెం.1 టీమ్‌గా నిలిచే బంపర్ ఛాన్స్, రోహిత్ సేన ముందుంది. ఈ రెండు సిరీసులు కూడా స్వదేశంలో జరగబోయేవే కావడంతో రోహిత్ టీమ్ కాస్త టఫ్ ఫైట్ ఇవ్వగలిగితే చాలు, గెలవడం పెద్ద కష్టమేమీ కాదు..

Image credit: PTI

ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ టీ20 నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతుంటే వన్డే ఫార్మాట్‌లో బాబర్ ఆజమ్ టాప్‌లో ఉన్నాడు. లంకతో సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, త్వరలో టాప్ 5లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

click me!