ఆ టైమ్‌లో భారత వుమెన్స్ టీమ్‌కి స్పాన్సర్‌గా మారిన మందిరా బేడీ... బీసీసీఐ పట్టించుకోని టైమ్‌లో...

First Published | Nov 3, 2022, 4:45 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. అయితే భారత మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లకు ఇచ్చే జీతభత్యాల్లో చాలా తేడాలు ఉంటాయి. వేసుకోవడానికి జెర్సీ కూడా లేక, పురుష క్రికెటర్లు వాడిన జెర్సీలకు టేపులు అంటించుకుని కొన్ని మ్యాచుల్లో బరిలో దిగింది మహిళా క్రికెట్ టీమ్. అలాంటి సమయంలో క్రికెట్ యాంకర్, మోడల్, బాలీవుడ్ నటి మందిరా బేడీ.. వుమెన్స్ టీమిండియాకి స్పాన్సర్‌గా మారిందనే విషయం తెలుసా...

పురుష క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో రూ.7 కోట్లు ఇస్తున్న బీసీసీఐ, మహిళా క్రికెటర్లకు రూ.1 కోటి ఇచ్చేందుకే చాలా వంకరలు పోతుంది. అయితే ఈ మధ్యే పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజుని పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

అయితే బీసీసీఐ, భారత మహిళా టీమ్‌ని పట్టించుకోని సమయంలో మందిరా బేడీ, వారికి అండగా నిలిచింది. మయంతి లంగర్, సంజన గణేశన్ వంటి యాంకర్ల కంటే ముందు క్రికెట్ యాంకర్‌గా, స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా మంచి పాపులారిటీ దక్కించుకుంది మందిరా బేడీ...


ఐపీఎల్‌లో కూడా మందిరా బేడీ వ్యాఖ్యానం,  క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ని ఆమె వేసే ప్రశ్నలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. 2004లో భారత మహిళా టీమ్ ఆడుతున్న ఓ మ్యాచ్ చూసేందుకు వెళ్లింది మందిరా బేడీ. ఆ సమయంలో బీసీసీఐ వుమెన్స్ ఇంకా ఏర్పడలేదు. అప్పుడు వుమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారత మహిళా జట్టు క్రికెట్ మ్యాచులు ఆడేది.

ఈ సమయంలో వుమెన్స్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శుభాంగీ కులకర్ణి, మందిరా బేడీని సాయం కోరింది. భారత మహిళా క్రికెట్ టీమ్ ఎదుగుదలకు సాయపడాల్సిందిగా కోరింది. అదే టైమ్‌లో మందిరా, ‘అస్మీ’ అనే జ్యూవెలరీ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది...

బ్రాండ్ అంబాసిడర్‌గా వచ్చే డబ్బు తీసుకోకుండా... ‘అస్మీ’ని వుమెన్స్ క్రికెట్ టీమ్‌కి స్పాన్సర్‌షిప్ ఇచ్చేలా ఒప్పించింది మందిరా బేడీ. అలా వచ్చిన డబ్బుతోనే 2004లో భారత మహిళా క్రికెట్ టీమ్, వెస్టిండీస్‌లో పర్యటించి వన్డే సిరీస్ ఆడింది...

అలాగే భారత మహిళా క్రికెట్ టీమ్‌కి కూడా స్వచ్ఛందంగా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది మందిరా బేడీ. అప్పటిదాకా భారత మహిళా క్రికెట్ టీమ్ ఉందని కూడా తెలియని చాలా మంది, మందిరా రాకతో ఇటువైపు చూడడం మొదలెట్టారు. అలా బీసీసీఐ, మహిళా క్రికెట్‌ కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంతో కూడా మందిరా బేడీ కృషి చాలా ఉంది...

Latest Videos

click me!