రోహిత్ శ‌ర్మ ఇంత‌పెద్ద త‌ప్పు ఎలా చేశాడు? 36 ఏళ్ల చ‌రిత్ర‌కు బ్రేక్ ప‌డుతుందా?

First Published | Oct 18, 2024, 7:12 PM IST

Rohit Sharma : 36 ఏళ్ల క్రితం 1988లో భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ గెలిచింది. మ‌రోసారి భార‌త్ పై విజ‌యాన్ని అందుకునే విధంగా బెంగ‌ళూరు టెస్టులో కీవిస్ క‌నిపిస్తోంది. అయితే, మ్యాచ్ విష‌యంలో రోహిత్ శ‌ర్మ తీసుకున్న పెద్ద నిర్ణ‌యం ఇప్పుడు క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 
 

Rohit Sharma

Rohit Sharma: క్రికెట్ గ్రౌండ్ లో ఒక్కోసారి ఊహించ‌ని సంఘటనలు జ‌ర‌గ‌డం కొత్తేమీ కాదు. చాలా సార్లు గెలిచే మ్యాచ్ ల‌ను ఓడిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. అలాగే, ఓడిపోయే మ్యాచ్ లు అనూహ్యంగా గెలిచిన సంద‌ర్భాలు ఉన్నాయి. న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న‌ బెంగళూరు టెస్ట్‌లో టీమిండియాతో ఇలాంటిదే జరిగింది.

ఒక తప్పుడు నిర్ణయం జట్టుకు చాలా నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తీసుకున్న ఒక పెద్ద నిర్ణ‌యం త‌ప్పని సూచ‌న‌లు కనిపించ‌డంతో అత‌ను హాట్ టాపిక్ అవుతున్నాడు. రోహిత్ శ‌ర్మ ఇలాంటి పెద్ద త‌ప్పు ఎలా చేశాడ‌ని న‌మ్మ‌లేక‌పోతున్నారు. అస‌లు ఏం జ‌రిగిందంటే..

Ravindra Jadeja-Rohit Sharma

క్రికెట్ లో కానీ మ‌రేదైనా గేమ్ లో కానీ నిర్ణయాలు కొన్నిసార్లు మంచి ఫ‌లితాలు ఇస్తాయి. మ‌రికొన్ని సార్లు తప్పుగా ఉంటాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో కూడా రోహిత్ శర్మ నిర్ణయం జట్టుకు తప్పని తేలింది. బెంగళూరు పిచ్‌ను కెప్టెన్ తప్పుగా అంచనా వేయడంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం జట్టుకు చాలా న‌ష్టం క‌లిగించింది. ఇది చాలా ఖరీదైన త‌ప్పుడు నిర్ణ‌యంగా మారింది. 

బెంగ‌ళూరులో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ ప‌రుగులు చేయ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది. ప్ర‌పంచ క్రికెట్ టాప్-10 అత్య‌ల్ప మొత్తం స్కోర్ ల‌లో ఒక‌టిని న‌మోదుచేస్తూ కేవ‌లం 46 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. భార‌త బ్యాట్స్‌మెన్‌లు వ‌రుస‌గా ఇలా వ‌చ్చి అలా పెవిలియన్‌కు చేరారు. ఐదుగురు భారత బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేని పరిస్థితి నెలకొంది. భారత ఇన్నింగ్స్ మొత్తం కేవలం 46 పరుగులకే కుప్పకూలగా, ఇప్పుడు అదే పిచ్‌పై న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోరు చేసింది.


భారత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ నిర్ణయం కారణంగా 36 ఏళ్ల క్రికెట్ చరిత్ర మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు కోచింగ్ కెరీర్ కు ఇది పెద్ద దెబ్బ. రోహిత్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుగా అంగీకరించాడు. పిచ్  ను అంచ‌నా వేయ‌డంలో తాను తప్పు చేశానని అంగీకరించాడు. 36 ఏళ్ల చరిత్రను గ‌మ‌నిస్తే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ నిర్ణయం భార‌త జ‌ట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్ప‌డంలో సందేహం లేదు.

Rohit Sharma, India, cricket

రోహిత్ శ‌ర్మ త‌ప్పుడు నిర్ణ‌యం కార‌ణంగా న్యూజిలాండ్ మ‌రో చ‌రిత్ర‌కు సిద్ధ‌మైంది. ఆ జ‌ట్టులో  నిర్ణయం ఇప్పుడు 36 ఏళ్ల చరిత్రను తిరగరాస్తుందనే ఆశలు రేకెత్తించింది. ఇక్కడ 36 ఏళ్ల చరిత్ర అంటే భారత్‌లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌లు గెలవడం. న్యూజిలాండ్ చివరిసారిగా 36 ఏళ్ల క్రితం అంటే 1988లో భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇప్పుడు కివీస్ జ‌ట్టు మ‌రోసారి భార‌త్ లో టీమిండియాపై విజ‌యం అందుకోవాల‌ని చూస్తోంది. ప్రస్తుతం బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ బలమైన స్థితిలో ఉంది. 

భార‌త్ త‌న‌ సొంత గడ్డపై జరిగిన టెస్టు మ్యాచ్‌లో 46 పరుగులకే కుప్ప‌కూలింది. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత భారత్‌లో న్యూజిలాండ్‌ టెస్టు మ్యాచ్‌ గెలిస్తే.. గంభీర్‌ కోచింగ్‌లో గతంలో ఎన్నడూ జరగని సంఘటనలు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో వారి నిర్ణ‌యాల‌పై ప్ర‌శ్న‌లు రావ‌డం సహజం. అయితే టీమిండియాకు మ‌రో ఇన్నింగ్స్ మిగిలి ఉంది. 

Rohit Sharma DRS

మూడో రోజు ఆట లో భార‌త్ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసింది. వికెట్లు కాపాడుకుంటూనే అటాకింగ్ బ్యాటింగ్ ను మొద‌లుపెట్టింది. ప్ర‌స్తుతం మ్యాచ్ ను గ‌మ‌నిస్తే 231/3 ప‌రుగుల‌తో రెండో ఇన్నింగ్స్ ను కొన‌సాగిస్తోంది. యశస్వి జైస్వాల్ 35 ప‌రుగులు, విరాట్ కోహ్లీ 70 ప‌రుగులు, రోహిత్ శ‌ర్మ 52 ప‌రుగులు చేసి ఔట్ అయ్యారు. 70* ప‌రుగుల‌తో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. ఇంకా భార‌త జ‌ట్టు 125 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. 

నాలుగో రోజు భార‌త జ‌ట్టు ఆట ఎలా సాగుతుంద‌నేది ఆస‌క్తిని పెంచుతోంది. భారీ ఓటమిని తప్పించుకోవాలంటే భారత జట్టు పటిష్ట ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఓట‌మి నుంచి త‌ప్పించుకోవాలంటే మిగ‌తా బ్యాట‌ర్ల నుంచి కూడా పెద్ద ఇన్నింగ్స్ లు రావాలి. మ‌రీ భార‌త్ నాలుగు, ఐదో రోజు ఏం చేస్తుందో చూడాలి మ‌రి.

Latest Videos

click me!