‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు... టీమిండియా నుంచి మొట్టమొదటి...

First Published Sep 6, 2021, 10:41 PM IST

ది ఓవల్ టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. ఇది సమిష్టి విజయం. టీమ్‌లోని ప్రతీ సభ్యుడి నుంచి (ఒక్క అజింకా రహానే మినహా) ఎంతో కొంత జట్టుకి అవసరమైన పర్ఫామెన్స్ వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇద్దరి పర్ఫామెన్స్ హైలెట్ అయ్యింది. ఒకరు రోహిత్ శర్మ, రెండో వ్యక్తి శార్దూల్ ఠాకూర్...

రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేసిన రోహిత్ శర్మ... భారత జట్టు భారీ స్కోరు చేసి, ఇంగ్లాండ్‌ ముందు కొండంత లక్ష్యాన్ని పెట్టేందుకు మార్గం వేశాడు. రోహిత్ సెంచరీ కారణంగానే మిడిల్ ఆర్డర్‌లో, లోయర్ ఆర్డర్‌లోనూ బ్యాటింగ్ తేలికైంది...

అలాగే ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. అటు బ్యాటుతో తొలి ఇన్నింగ్స్‌లో, రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు హాఫ్ సెంచరీలు చేశాడు శార్దూల్ ఠాకూర్. తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ బ్యాటుతో ఫెయిల్ అయి ఉంటే, టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది...

అలాగే తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులో కుదురుకుపోయిన ఓల్లీ పోప్‌ను అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీయడంతో పాటు బీభత్సమైన ఫామ్‌లో ఉన్న జో రూట్‌ను పెవిలియన్ చేర్చాడు...

ఓవరాల్‌గా బ్యాటుతో 117 పరుగులు, బాల్‌తో మూడు వికెట్టు తీసిన శార్దూల్ ఠాకూర్... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకుంటాడని అందరూ భావించారు. అయితే అన్యూహంగా రెండో ఇన్నింగ్స్ సెంచరీ హీరో రోహిత్ శర్మకు ఈ అవార్డు దక్కింది...

ఓవల్ టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా ఈ స్టేడియంలో ఈ అవార్డు గెలిచిన రెండో ఆసియా బ్యాట్స్‌మెన్ కూడా రోహిత్ శర్మనే...

ఇంతకుముందు పాక్ బ్యాట్స్‌మెన్ యూనిస్ ఖాన్ మాత్రమే ది ఓవల్ టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. ఓవరాల్‌గా ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్, మహ్మద్ అమీర్, ముస్తాక్ అహ్మద్ వంటి బౌలర్లకు మాత్రం ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి...

తన తొలి టెస్టు మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన రోహిత్ శర్మ, ఓపెనర్‌గా 2019లో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...

అలాగే టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన మ్యాచ్‌లో, తాజాగా తొలి విదేశీ సెంచరీ సాధించిన మ్యాచ్‌లోనూ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచాడు రో‘హిట్’ శర్మ...

ఇంగ్లాండ్‌లో వన్డేల్లో, టీ20ల్లో, టెస్టుల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ..

రోహిత్ శర్మ కెరీర్‌లో ఇది 35వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. టీమిండియా తరుపున సచిన్ టెండూల్కర్ 76, విరాట్ కోహ్లీ 57, సౌరవ్ గంగూలీ 37 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచి, రోహిత్ కంటే ముందున్నారు.

click me!