వాట్ ఏ కమ్‌బ్యాక్... అప్పుడు ఆడిలైడ్‌, ఇప్పుడు లీడ్స్... 50 ఏళ్ల తర్వాత విరాట్ సేన చరిత్ర...

Published : Sep 06, 2021, 09:34 PM IST

లార్డ్స్ టెస్టులో ఘన విజయం తర్వాత లీడ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. ఆడిలైడ్ టెస్ట్ తర్వాత మెల్‌బోర్న్‌లో మెరిసినట్టే...  లీడ్స్ పరాజయం తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది భారత జట్టు...1971 తర్వాత 50 ఏళ్లకు ఇంగ్లాండ్‌లోని ది ఓవల్ స్టేడియంలో విజయాన్ని అందుకుంది.

PREV
19
వాట్ ఏ కమ్‌బ్యాక్... అప్పుడు ఆడిలైడ్‌, ఇప్పుడు లీడ్స్... 50 ఏళ్ల తర్వాత విరాట్ సేన చరిత్ర...

విదేశాల్లో భారత సారథి విరాట్ కోహ్లీకి ఇది 15వ టెస్టు విజయం. ఇప్పటికే విదేశాల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ, తన రికార్డును మరింత పెంచుకున్నాడు. సౌరవ్ గంగూలీ 11, ధోనీ 6 విజయాలు అందుకున్నారు.

29

విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఇది 38వ టెస్టు విజయం. ఇంగ్లాండ్‌లో మూడో టెస్టు విజయం. ఇంగ్లాండ్‌లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు కోహ్లీ...

39

ఇంతకుముందు ఇంగ్లాండ్‌లో కపిల్‌దేవ్ రెండు విజయాలు అందుకోగా ఎమ్మెస్ ధోనీ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, అజిత్ వాడేకర్ తలా ఓ విజయాన్ని అందుకున్నారు..

49

ఒకే టూర్‌లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌, ది ఓవల్ టెస్టు మ్యాచుల్లో గెలవడం టీమిండియాకి ఇది తొలిసారి. ఇంతకుముందు ఆస్ట్రేలియా నాలుగుసార్లు, విండీస్ 4, పాకిస్తాన్ మూడు సార్లు ఈ ఫీట్ సాధించాయి...

59

నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ను 157 పరుగుల తేడాతో ఓడించింది టీమిండియా. విదేశాల్లో 100+ తేడాతో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

69

ఇంతకుముందు విండీస్ లెజెండ్ క్లెయిన్ లాయిడ్, పాక్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ విదేశాల్లో 11 సార్లు ఈ ఫీట్ సాధించగా... విరాట్ కోహ్లీ ఆ రికార్డును సమం చేశాడు.

79

ఓవరాల్‌గా 100+ తేడాతో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా తన రికార్డును తానే మెరుగుపర్చుకున్నాడు విరాట్ కోహ్లీ. విరాట్‌కి ఇది ఓవరాల్‌గా 100+ ఆధిక్యంతో 26వ విజయం...

89

ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 23సార్లు, గ్రేమ్ స్మిత్, జో రూట్, స్టీవ వా 15 సార్లు ఈ ఫీట్ సాధించారు. 2021లో ఆస్ట్రేలియాలో గబ్బా టెస్టులో ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా, ఇంగ్లాండ్‌లో రెండు విజయాలు అందుకుంది. టీమిండియా చరిత్రలోనే 2018 తర్వాత సేనా దేశాల్లో ఇదే రికార్డు...

99

ఇన్నింగ్స్ తేడాతో ఓడిన తర్వాతి మ్యాచ్‌లో గెలవడం టీమిండియా చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు 2008లో శ్రీలంకపై, 2010లో సౌతాఫ్రికాపై ఇన్నింగ్స్ తేడాతో ఓడిన తర్వాతి మ్యాచుల్లో విజయాలు అందుకుంది టీమిండియా.

click me!

Recommended Stories