ఆ తిప్పలన్నీ మీకెందుకు, మ్యాచ్‌ను ఎంజాయ్ చేయండి... టీమిండియా విజయంపై ఏబీ డివిల్లియర్స్ ట్వీట్...

Published : Sep 06, 2021, 10:19 PM IST

నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్‌లో టీమిండియాకి ఏ మాత్రం మెరుగైన రికార్డు లేని ది ఓవల్ స్టేడియంలో 50 ఏళ్ల తర్వాత విజయాన్ని అందుకుని, చరిత్ర క్రియేట్ చేసింది. తాజాగా ఈ విజయంపై స్పందించాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, ఆర్‌సీబీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్...

PREV
110
ఆ తిప్పలన్నీ మీకెందుకు, మ్యాచ్‌ను ఎంజాయ్ చేయండి... టీమిండియా విజయంపై ఏబీ డివిల్లియర్స్ ట్వీట్...

టెస్టు సిరీస్ ఆరంభం నుంచి భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి...

210

నాలుగో టెస్టులో అశ్విన్ ఉండి ఉంటే, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కి ఆధిక్యం దక్కి ఉండేది కాదనేది టీమిండియా అభిమానులు, విశ్లేషకుల అంచనా...

310

అదే విధంగా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న అజింకా రహానేకి చోటు ఇస్తుండడంపై కూడా ట్రోల్స్ వినిపించాయి. రిజర్వు బెంచ్‌లో పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారి వంటి ప్లేయర్లు అందుబాటులో ఉన్నప్పుడు రహానేని కొనసాగించడం ఏంటని నిలదీశారు...

410

అయితే ఆ ట్రోల్స్‌ అన్నీ బేఖాతరు చేసేలా నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేస్తూ, ఘన విజయాన్ని అందుకుంది భారత జట్టు. ఈ విజయంపై ఏబీ డివిల్లియర్స్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు...

510

‘టెస్టు క్రికెట్ ‘‘ప్రేక్షకులు’గా మీరు టీమ్ సెలక్షన్ గురించి, మిగిలిన అనవసర విషయాల గురించి బాధపడడం మానేయండి. వాళ్లు ఆడుతున్న విధానాన్ని, హోరాహోరీ పోటీనీ, అంకితభావాన్ని, స్కిల్స్... అన్నింటికీ మించి వారి కళ్లల్లో కనిపిస్తున్న దేశభక్తిని అభిమానించడం మొదలెట్టండి...

610

అనవసర విషయాలను పట్టించుకోవడం వల్ల మంచి గేమ్‌ను ఎంజాయ్ చేయడం మిస్ అవుతున్నారు... టీమిండియా బాగా ఆడింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. వారి స్కిల్స్, సాహసం అద్భుతం...’ అంటూ ట్వీట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్...

710

‘జో రూట్, ఇంగ్లాండ్ జట్టు కూడా బాగా ఆడింది. మీ పోరాటం కారణంగానే ఐదు రోజుల పాటు ఓ అందమైన మ్యాచ్ చూసే అవకాశం దొరికింది... ఆఖరి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్.

810

కోహ్లీకి ఆప్త మిత్రుడైన ఏబీ డివిల్లియర్స్, టీమ్ సెలక్షన్‌పై విరాట్‌పై వస్తున్న ట్రోల్స్, కామెంట్స్ చూసే ఇలాంటి స్పందించి ఉండవచ్చని కొందరు అంటున్నారు.

910

 మరికొందరు మాత్రం కోహ్లీయే ఏబీడీ అకౌంట్ నుంచి ఇలా ట్వీట్ చేసి ఉండవచ్చని దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు...

1010

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కోసం యూఏఈ చేరుకున్నాడు ఏబీ డివిల్లియర్స్. ఐదో టెస్టు ముగించుకున్న తర్వాత విరాట్ కోహ్లీ అండ్ టీమ్ కూడా యూఏఈ బయలుదేరుతుంది. విరాట్ వచ్చేదాకా ఆర్‌సీబీ క్యాంపును ఏబీడీ లీడ్ చేస్తాడు.

click me!

Recommended Stories