INDvsENG: తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంగ్లాండ్‌కి భారీ ఆధిక్యం... 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా...

Published : Aug 26, 2021, 08:28 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమి అంచుల్లోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండో రోజు టీ బ్రేక్ విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 298 పరుుగలు చేసింది ఇంగ్లాండ్. టీ బ్రేక్ విరామానికి ముందు వేసిన ఆఖరి బంతికి వికెట్ దక్కడం విశేషం...

PREV
110
INDvsENG: తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంగ్లాండ్‌కి భారీ ఆధిక్యం... 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా...

తొలి వికెట్‌కి 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. 153 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసిన రోరీ బర్న్స్‌ను మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు.

210

ఆ తర్వాత 195 బంతుల్లో 12 ఫోర్లతో 68 పరుుగులు చేసిన హసీబ్ హమీద్‌ను రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు...  ఈ టెస్టు సిరీస్‌లో జడేజాకి దక్కిన తొలి వికెట్ ఇదే.

310

ఆ తర్వాత బీభత్సమైన ఫామ్‌లో ఉన్న జో రూట్, మూడేళ్ల తర్వాత తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ మలాన్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు...

410

భారత బౌలర్ల నుంచి లార్డ్స్ టెస్టు రేంజ్‌లో పర్ఫామెన్స్ రాకపోవడంతో ఈ ఇద్దరూ స్వేచ్ఛగా బౌండరీలు బాదారు. మూడో వికెట్‌కి 139 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదుచేశారు డేవిడ్ మలాన్, జో రూట్...

510

128 బంతుల్లో 11 ఫోర్లతో 70 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన టీమిండియాకి అనుకూలంగా ఫలితం దక్కింది.

610

2005లో బంగ్లాదేశ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టు తర్వాత ఇంగ్లాండ్‌లోని టాప్ 4 బ్యాట్స్‌మెన్ 50+ స్కోర్లు చేయడం ఇదే మొదటిసారి. లార్డ్స్ టెస్టు పరాజయం, ఇంగ్లాండ్ జట్టులో తీసుకొచ్చిన మార్పుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ...

710

ఇప్పటికే భారత జట్టుపై 220 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుంది ఇంగ్లాండ్ జట్టు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జో రూట్ 94 బంతుల్లో 9 ఫోర్లతో 80 పరుగులు చేసి మరో సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నాడు...

810

ఇంకా ఇంగ్లాండ్ చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్ వరకూ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేయగలరు...

910

ఎలా చూసుకున్నా కనీసం ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 350+ ఆధిక్యం దక్కేలా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడినట్టు భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరును దాటించి పరుగులు చేసి... మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే అసాధారణంగా రాణించాల్సి ఉంటుంది. 

1010

ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతూ వరుస వికెట్లు తీసిన చోట భారత బౌలర్లు వికెట్లు తీయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఇప్పటిదాకా ఒక్క వికెట్ తీయలేకపోగా... భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

click me!

Recommended Stories