భారత టెస్టు క్రికెట్‌లో అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. మొహాలీ టెస్టులో 6 వికెట్లు తీసి, కపిల్‌దేవ్ (434) వికెట్ల రికార్డును అధిగమించిన అశ్విన్, కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితులను బయటపెట్టాడు...
తమిళనాడు తరుపున 2006లో ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్, భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ కోచింగ్‌లో శిక్షణ పొందాడు...
212
భారత మహిళా జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు రవిచంద్రన్ అశ్విన్...
312
‘నేను నా మొదటి మ్యాచ్ కోసం చెపాక్ స్టేడియానికి వెళ్లినప్పుడు అక్కడ రామన్ కోచ్‌గా ఉన్నారు. ఆయన ఓ హార్డ్ టాస్క్‌మాస్టర్... రామన్‌తో మాట్లాడడానికి కూడా చాలామంది భయపడతారు...
412
ఓ రోజు నేను ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉన్నప్పుడు ఆయన ఫీల్డింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. ఆయన బౌలర్లపై పెట్టే ప్రెషర్ అంతా ఇంతా కాదు...
512
ఒకవేళ స్టంప్స్ పైకి బంతి విసరలేకపోతే, ఆయన కోపాన్ని భరించాల్సిందే. అలా... ఇలా... అని అరిచేసేవాడు. ఇలా 10 రోజులు, 12 రోజులు, 2 వారాలు, మూడు వారాలు గడిచాయి...
612
రోజులు గడిచేకొద్ది ఆయనతో కాస్త చనువు పెరిగి, సౌకర్యవంతంగా ఫీల్ అయ్యాడు. ఆయన నన్ను నెట్స్‌లో చాలా ప్రోత్సహించేవాడు, నేను ఆయన్ని రకరకాల ప్రశ్నలు అడిగి విసిగించేవాడిని...
712
టీమ్ మీటింగ్స్‌లో మాట్లాడడానికి కూడా భయపడేవాడిని కాదు. ఓ రోజు, రామన్ నా పక్కనే నిలబడి, ‘అశ్విన్, నువ్వు చాలా మెరుగయ్యావ్. టీమ్ మీటింగ్స్‌లో నువ్వు మాట్లాడిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే...
812
అయితే నువ్వు ఓ విషయం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి టీమిండియాలోకి వెళ్లిన తర్వాత బేసిక్స్ నేర్చుకోవడానికి వెతుక్కోవాల్సిన పరిస్థితి రాకూడదు. అందుకే నేను ఇంత కఠినంగా ఉంటాను...
912
ఆ మాటలతో ఆయనపై నాకున్న అభిమానం రెట్టింపు అయ్యింది. ఆయన నెట్స్‌లో ఎంత కఠినంగా ఉంటారో నాకు తెలుసు. అందుకే ఆయన గ్రౌండ్‌లో ఉంటే లోపలికి రావడానికి కూడా అందరూ భయపడతారు...’ అంటూ కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...
1012
రవిచంద్రన్ అశ్విన్ కామెంట్లపై టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అశ్విన్ ఇచ్చిన ఇంటర్వ్యూకి ‘అయ్యో...’ అంటూ కామెంట్ చేశాడు...
1112
‘అశ్విన్ ఎంతో చురుకైన క్రికెటర్. క్రికెట్ గురించి తెలుసుకోవాలని తపన, అతనిలో రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఏ పొజిషన్‌లో అయినా రాణించగల మోడ్రన్ క్రికెటర్...’ అంటూ అశ్విన్ గురించి కామెంట్ చేశాడు డబ్ల్యూవీ రామన్..
1212
తమిళనాడు తరుపున 140 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 672 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరుపున 85 టెస్టుల్లో 436 వికెట్లు తీశాడు... బ్యాటుతోనూ రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌కి టెస్టుల్లో 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో 2905 పరుగులు ఉన్నాయి...