Published : Mar 11, 2022, 03:01 PM ISTUpdated : Mar 11, 2022, 03:07 PM IST
Lasith Malinga: ముంబై ఇండియన్స్ తరఫున ఏకంగా పదేండ్ల పాటు ఆడిన మలింగ.. ఆ జట్టుకు భారీ షాకిచ్చాడు. తన మిత్రుడు మహేళ జయవర్ధనే ను కాదని, మరో సహచర ఆటగాడు సంగక్కర కోసం...
శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగ తన హోం ఫ్రాంచైజీగా భావించే ముంబై ఇండియన్స్ కు భారీ షాకిచ్చాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆ జట్టుతోనే కలిసి నడిచిన మలింగ.. ఇప్పుడు ఆ జట్టుకు గుడ్ బై చెప్పాడు.
28
తాజాగా అతడు తన మాజీ సహచర ఆటగాడు కుమార సంగక్కర హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రాజస్థాన్ రాయల్స్ తో జట్టుకట్టాడు.
38
ఈ సీజన్ నుంచి మలింగ.. రాజస్థాన్ రాయల్స్ కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ మేరకు రాజస్థాన్ తన ట్విట్టర్ ఖాతా వేదిగకా ఈ విషయాన్ని ప్రకటించింది.
48
తన ఐపీఎల్ కెరీర్ అంతా ముంబై ఇండియన్స్ తోనే గడిపాడు మలింగ.. ఐపీఎల్ లో అతడు 2009 లో ఎంట్రీ ఇచ్చాడు. 2009 నుంచి 2019 సీజన్ దాకా అతడు ముంబైతోనే కలిసి నడిచాడు.
58
ముంబై తరఫున 122 మ్యాచులాడిన మలింగ.. ఏకంగా 170 వికెట్లు పడగొట్టాడు. యార్కర్ల కింగ్ అయిన మలింగ.. పోతూ పోతూ జట్టుకు బుమ్రా రూపంలో ముంబైకి ఓ ప్రధాన బౌలర్ ను తయారుచేసి వెళ్లాడు. మలింగ మార్గనిర్దేశనంలో బుమ్రా అత్యున్నత శిఖరాలకు చేరాడు.
68
కాగా.. 2019 సీజన్ తర్వాత ఐపీఎల్ కు గుడ్ బై చెప్పినా అతడు ముంబై తో సంబంధాలు కొనసాగించాడు. ఆ జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్దనే కూడా మలింగకు మంచి స్నేహితుడే. ఇద్దరూ శ్రీలంక దిగ్గజాలే కావడంతో ముంబైకి అతడి సేవలు అందుతాయని అందరూ భావించారు.
78
కానీ ఈ సీజన్ లో అనూహ్యంగా అతడు రాజస్థాన్ కు బౌలింగ్ కోచ్ గా నియమితుడవడం వెనుక మలింగ మరో సహచర ఆటగాడు, లంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర చక్రం తిప్పాడు. ముంబై కన్ను మలింగ మీద పడకముందే.. రాజస్థాన్ కు బౌలింగ్ కోచ్ గా ఒప్పించాడు.
88
ప్రస్తుతం ముంబైకి మహేళ జయవర్దనే హెడ్ కోచ్ కాగా.. న్యూజిలాండ్ మాజీ బౌలర్ షేన్ బాండ్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.