టీమిండియా కోసం ఆ త్యాగానికి సిద్ధమైన వీవీఎస్ లక్ష్మణ్... ఎన్‌సీఏ కొత్త డైరెక్టర్‌‌పై సౌరవ్ గంగూలీ..

First Published Nov 17, 2021, 9:24 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టులో కీలక మార్పులు జరుగుతూనే ఉన్నాయి. భారత టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకుంటుండగా జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ కొత్త పదవిలో కనిపించబోతున్నాడు...

టీమిండియా తరుపున 134 టెస్టు మ్యాచుల్లో 17 సెంచరీలతో 8781 పరుగులు చేసిన వీవీఎస్ లక్ష్మణ్, 86 వన్డేల్లో 6 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో 2338 పరుగులు చేశాడు...

భారత జట్టు తరుపున 100కి పైగా టెస్టులు ఆడినా ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచులు ఆడని ప్లేయర్‌గా అరుదైన రికార్డు క్రియేట్ చేసిన వీవీఎస్ లక్ష్మణ్, ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ) డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు...

‘టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్, ఎన్‌సీఏ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియామకం జరగడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ రెండు పొజిషన్స్ భారత క్రికెట్‌కి ఎంతో ముఖ్యమైనవి...

నేను అడగగానే రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ అంగీకరించారు. భారత భవిష్యత్తు మంచి వ్యక్తుల చేతుల్లో పెట్టినందుకు ఆనందంగా ఉంది. కాస్త ఎమోషనల్‌గా కూడా ఉంది...

వీవీఎస్ లక్ష్మణ్‌లో నాకు బాగా నచ్చిన విషయం అతని కమిట్‌మెంట్. ఏ పని అప్పగించినా దాన్ని పూర్తి చేసేందుకు ఎంత వరకూ వెళ్లడానికైనా వీవీఎస్ ముందుంటాడు.

వీవీఎస్‌కి భారత క్రికెట్ అంటే ఎంతో గౌరవం ఉంది. రాహుల్ ద్రావిడ్ భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు అందుకోవడంతో తాను రాజీనామా చేసిన ఎన్‌సీఏ డైరెక్టర్‌ పొజిషన్‌లో అతనిలాంటి టాలెంట్, నిబద్ధత ఉన్న క్రికెటర్ కోసం వెతికాం...

వీవీఎస్, రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ ఇద్దరే. క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్‌గా ఉంటారు. అతను ఈ పొజిషన్‌ కోసం చాలా ఆదాయాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధమయ్యాడు...

కేవలం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఎలాంటి ఆటంకం, అవాంతరాలు లేకుండా తన బాధ్యతలు నిర్వహించడానికి వీలుగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నాడు వీవీఎస్ లక్ష్మణ్...

అతని ఆదాయం తగ్గనుంది. తన భార్య, పిల్లలు కూడా బెంగళూరుకి మకాం మార్చాలి. ఇప్పుడు వాళ్ల పిల్లల చదువులు కూడా బెంగళూరులోనే... వారి కుటుంబంలో ఈ పొజిషన్ చాలా మార్పులు తీసుకురానుంది..’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మెంటర్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్, కామెంటేటర్‌గా కూడా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ నిబంధనల కారణంగా ఆ రెండు పదవుల నుంచి తప్పుకోబోతున్నాడు...

ఎన్‌సీఏ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, భారత బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. దంతో మాంబ్రే స్థానంలో ఆస్ట్రేలియా కోచక్ ట్రాయ్ కూలీని ఎన్‌సీఏ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించనుంది బీసీసీఐ... 

click me!