బంగ్లా బ్యాటర్‌ని మాహీతో పోల్చిన కోచ్... ధోనీ అయినా ఎప్పటికీ ఆడుతూ ఉండడు కదా అంటూ...

Published : Sep 16, 2022, 04:16 PM IST

నిన్నగాక మొన్న వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాలతో టీ20ల్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపిస్తుంటే... ఎంతో అనుభవం ఉన్న బంగ్లాదేశ్ మాత్రం ఇప్పటికీ పసికూన జట్టుగానే విజయాలు అందుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది.. ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజీ దాటని బంగ్లాదేశ్, భారత మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ని కోచ్‌గా నియమించుకుంది...

PREV
16
బంగ్లా బ్యాటర్‌ని మాహీతో పోల్చిన కోచ్... ధోనీ అయినా ఎప్పటికీ ఆడుతూ ఉండడు కదా అంటూ...
Sridharan Sriram

టీ20 ఫార్మాట్‌లో బంగ్లాదేశ్ టెక్నికల్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు తీసుకున్న శ్రీధరన్ శ్రీరామ్.. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టు గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లాని మాహీతో పోలుస్తూ చేసిన కామెంట్లపై సీరియస్ అవుతున్నారు ధోనీ అభిమానులు..

26
mahmudullah and shakib al hasan

‘టీమ్‌లో మార్పులు చేయడం అనివార్యంగా మారింది. ఓ ప్లేయర్‌ని తప్పించడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. బంగ్లాదేశ్‌కి మహ్మదుల్లా అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ప్లేయర్...

36

మహ్మదుల్లా అంటే నాకే కాదు, బోర్డులో ప్రతీ ఒక్కరికీ ఎంతో గౌరవం ఉంది. అయితే విజయాలు కావాలంటే కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి. నా ఉద్దేశంలో మహ్మదుల్లా, ఎంఎస్ ధోనీతో సమానం. మాహీ పోషించిన రోల్‌నే బంగ్లాకి నిర్వహించాడు మహ్మదుల్లా...

46
Mahmudullah

ఇండియాకి ధోనీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. మహ్మదుల్లా కూడా బంగ్లాకి ఆరో స్థానంలోనే ఆడతాడు. మాహీలాగే బంగ్లాకి ఎన్నో మ్యాచులు ముగించి విజయాలు అందించాడు. అయితే ధోనీ కూడా ఎప్పటికీ ఆడుతూ ఉండిపోడు కదా...

56

ధోనీ తర్వాత ఎవరు? అనే ప్రశ్న రావాలి. అప్పుడే మహ్మదుల్లా ప్లేస్‌ని రిప్లేస్ చేయగల ప్లేయర్‌ని వెతికి పట్టుకునేందుకు అవకాశం క్రియేట్ చేసినట్టు అవుతుంది. అందుకే అతనికి రెస్ట్ ఇచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు శ్రీధరన్ శ్రీరామ్...

66

ముష్ఫికర్ రహీం టీ20 నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన లిటన్ దాస్, నురుల్ హాసన్, యాసిర్ ఆలీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోతున్నారు. ఈ ఏడాది 8 టీ20 మ్యాచులు ఆడి 151 పరుగులు చేసిన మహ్మదుల్లాని తప్పించి అతని ప్లేస్‌లో నజ్ముల్ హుస్సేన్‌కి అవకాశం ఇచ్చింది బంగ్లాదేశ్...

Read more Photos on
click me!

Recommended Stories