అంపైర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, అశ్విన్... లెజెండరీ మాజీ అంపైర్ సైమన్ టౌఫెల్...

Published : May 27, 2022, 06:14 PM IST

క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కంటే అతికష్టమైన పని అంపైరింగ్. మ్యాచ్ ముగిసేంత వరకూ క్రీజులో అలా నిలబడి జరిగే ప్రతీ చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తూ, నిష్ఫక్షపాతంగా నిర్ణయాలు వెల్లడించాల్సి ఉంటుంది అంపైర్లు...

PREV
18
అంపైర్లుగా  వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, అశ్విన్... లెజెండరీ మాజీ అంపైర్ సైమన్ టౌఫెల్...

రెండు జట్లు హోరాహోరీగా పోటీపడే ఆటలో అసలైన విజేతను నిర్ణయించే అంపైర్ల సహనానికి, ఓపికకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. అంపైర్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు...

28
umpire simon taufel

అలా తన అంపైరింగ్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుని, తనకంటూ అభిమానులను సంపాదించుకుంటూ అంపైర్లలో ఒకడు ఆస్ట్రేలియా మాజీ అంపైర్ సైమన్ టౌఫెల్...

38

తాజాగా ఐపీఎల్‌ 2022కి అంపైర్‌గా వ్యవహరిస్తున్న సైమన్ టైఫెల్, న్యూస్ 9 అనే వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు...

48
simon taufel, sehwag

‘వీరేంద్ర సెహ్వాగ్ అంపైర్‌గా మారితే చూడాలని ఉంది. ఎందుకంటే తను అంపైర్ పక్కన స్క్వైర్ లెగ్‌లో నిలబడి, నాకు ఏది అవుట్, ఏది కాదని చెబుతుండేవాడు... అయితే వీరూ ఎప్పుడూ అంపైర్‌గా అవ్వమంటే కాదని చెప్పేవాడు...

58

అలాగే మోర్నీ మోర్కెల్‌తోనూ అంపైరింగ్ గురించి మాట్లాడాడు. అతను అంపైరింగ్ తీసుకోవడానికి చాలా ఆసక్తి చూపించాడు. అయితే అంపైరింగ్ అందరి వల్ల అయ్యే పని కాదు...

68

వీరేంద్ర సెహ్వాగ్ లేదా విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి క్రికెట్ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నవారికే ఇది సాధ్యమవుతుంది. వీరికి క్రికెట్ రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్‌ గురించి బాగా తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు సైమన్ టైఫెల్...

78
Simon Taufel

దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీతో కలిసి ఆన్‌లైన్ అంపైరింగ్ కోర్సులను మొదలెట్టాడు సైమన్ టౌఫెల్. మూడు లెవెల్స్‌లో ఉన్న ఈ కోర్సుల్లో స్కిల్స్‌ని బట్టి అంపైర్‌గా మారే అవకాశాలు ఉంటాయి...

88
ashwin kohli

అంపైర్ సైమన్ టౌఫెల్ కామెంట్లతో ఒకవేళ ఫ్యూచర్‌లో రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ అంపైర్లుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందా? అని ఊహించుకుంటున్నారు అభిమానులు. కోపిష్టి, ఆవేశపరులుగా గుర్తింపు తెచ్చుకున్న వీళ్లు, అంపైర్లుగా ఓపికగా ఆటగాళ్లకు సర్ధిచెబుతారా? లేక వారితో క్రీజులోనే వాగ్వాదానికి దిగుతారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories