వేలంలో సన్‌రైజర్స్ తీరుపై అజారుద్దీన్ అసంతృప్తి... ఒక్క హైదరాబాదీ ప్లేయర్ లేడని...

First Published Feb 19, 2021, 3:25 PM IST

ఐపీఎల్ మినీ వేలం 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా స్మార్ట్‌గా వ్యవహారించింది. రూ.10 కోట్ల 75 లక్షలతో వేలంలో అడుగుపెట్టిన సన్‌రైజర్స్, ముగ్గురు ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేసింది. వారి కోసం రూ.3 కోట్ల 80 లక్షలు మాత్రమే ఖర్చు చేసి, రూ. 6 కోట్ల 95 లక్షలు పర్సులో అట్టిపెట్టుకుంది. 

కేదార్ జాదవ్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ ముజీబ్‌ను రూ.లక్షన్నరకి, సుజిత్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. కొందరు ప్లేయర్ల కోసం ప్రయత్నించినా, రేటు పెరిగిన తర్వాత రేసు నుంచి తప్పుకుంది.
undefined
‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక్క హైదరాబాద్ ప్లేయర్ కూడా లేకపోవడం చాలా నిరుత్సాహపరిచింది...’ అంటూ ట్వీట్ చేశాడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మెన్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్...
undefined
అజారుద్దీన్ ట్వీట్‌పై తెలుగు వారి నుంచి తీవ్రమైన స్థాయిలో ట్రోలింగ్ ఎదురవుతోంది. ఏ మాత్రం టాలెంట్ లేకపోయినా తన కొడుకుని హైదరాబాద్ జట్టుకి ఎంపిక చేసిన అజారుద్దీన్, ఐపీఎల్‌ లిస్టులో అసదుద్దీన్ పేరు లేకపోవడంతో బాగా ఫీల్ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
undefined
అదీ కాకుండా తన్మయ్ అగర్వాల్‌ని హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా నియమించిన అజారుద్దీన్, ఐపీఎల్‌లో జట్టు గురించి మాట్లాడడం సిగ్గుచేటని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
undefined
రంజీ ట్రోపీ, దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో హైదరాబాద్ ఆట తీరు ఎలా ఉందో అందరికీ తెలుసుని, ముందు క్రికెట్‌లో రాజకీయాలు చేయడం ఆపేసి... సత్తా ఉన్న క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు నెటిజన్లు...
undefined
ఐపీఎల్‌లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్లేయర్లు మంచి ధర దక్కించుకుంటుంటే, మనవాళ్లు బేస్ ప్రైజ్ కూడా దాటలేకపోతుండడం సిగ్గుచేటని... అయితే టాలెంట్ ఉన్న కుర్రాళ్లను ఎంపిక చేయలేని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి దీని గురించి అడిగే అర్హత లేదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
undefined
తెలుగు కుర్రాడు హనుమ విహారిని వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్‌లో ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.
undefined
మొత్తంగా ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం 12 మంది తెలుగు క్రికెటర్లు పాల్గొనగా కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం దక్కింది. వికెట్ కీపర్ కెఎస్ భరత్‌ను ఆర్‌సీబీ రూ.20 లక్షలకు కొనుగోలు చేయగా, హరి శంకర్ రెడ్డిని, కె. భగత్ వర్మను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.
undefined
click me!