టీ20 వరల్డ్ కప్ ఆల్‌టైం గ్రేటెస్ట్ టీమ్‌లో టీమిండియా నుంచి ఒకే ఒక్కడు... హర్షా భోగ్లే లిస్టులో...

First Published | Oct 22, 2022, 12:48 PM IST

జనాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కామెంటేటర్లలో హర్షా భోగ్లే ఒకడు. సొగసైన ఆటకు తన కామెంటరీతో మరిన్ని సొగసులు అద్దే హర్షా భోగ్లే, టీ20 వరల్డ్ కప్ ఆల్‌టైం గ్రేటెస్ట్ టీమ్‌ని ప్రకటించాడు. అయితే హర్షా ఆల్‌ టైం గ్రేటెస్ట్ లిస్టులో ఒకే ఒక్క భారత క్రికెటర్‌కి చోటు దక్కడం విశేషం...

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ని టీ20 వరల్డ్ కప్ ఆల్ టైం గ్రేటెస్ట్ టీమ్‌లో ఓపెనర్‌గా ఎంచుకున్నాడు హర్షా భోగ్లే. గేల్‌తో పాటు మరో ఓపెనర్‌గా ఇంగ్లాండ్ వికెట్ కీపర్, ప్రస్తుత కెప్టెన్ జోస్ బట్లర్‌కి ఓపెనర్‌గా చోటు దక్కింది...

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని వన్‌డౌన్ ప్లేయర్‌గా ఎంచుకున్నాడు హర్షా భోగ్లే. ఈ భారత కామెంటేటర్ లిస్టులో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారత ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రమే. 2014, 2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలిచాడు విరాట్ కోహ్లీ...


ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్‌ని నాలుగో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్న హర్షా భోగ్లే, ఐదో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హుస్సీకి చోటు ఇచ్చాడు. ఆరో స్థానంలో ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కి చోటు దక్కింది...

Shahid Afridi

పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీతో పాటు ఫాస్ట్ బౌలింగ్ ఉమర్ గుల్‌కి హర్షా భోగ్లే... ఆల్‌టైం గ్రేట్ టీ20 వరల్డ్ కప్‌ టీమ్‌లో చోటు దక్కింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌తో పాటు శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ కూడా హర్షా లిస్టులో స్థానం సంపాదించుకోగలిగారు...

అలాగే వెస్టిండీస్ స్పిన్ బౌలర్ శ్యామూల్ బద్రీకి హర్షా భోగ్లే ఆల్‌ టైం గ్రేట్ టీ20 వరల్డ్ కప్ టీమ్ లిస్టులో చోటు దక్కింది. హర్షా భోగ్లే లిస్టులో జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ, ట్రెంట్ బౌల్ట్ మాత్రమే ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నారు. విండీస్ ప్లేయర్లు క్రిస్ గేల్, శ్యామూల్స్ బద్రీ రిటైర్మెంట్ ప్రకటించకపోయినా వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయారు...

Harsha Bhogle

హర్షా భోగ్లే ఆల్‌టైం గ్రేట్ టీ20 వరల్డ్ కప్ టీమ్ ఇది: క్రిస్ గేల్, జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ, కేవిన్ పీటర్సన్, మైకేల్ హుస్సీ, షేన్ వాట్సన్, షాహిదీ ఆఫ్రిదీ, ఉమర్ గుల్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, శ్యామూల్ బద్రీ

Latest Videos

click me!