దినేశ్ కార్తీక్‌కి రెస్ట్! ఇద్దరు స్పిన్నర్లకు ఛాన్స్... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత జట్టు ఇదే...

First Published | Oct 21, 2022, 4:51 PM IST

37 ఏళ్ల వయసులో టీ20 వరల్డ్ కప్ 2022 ఆడే టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. అయితే అవకాశాల కోసం కుర్రాళ్లు ఎదురుచూస్తుంటే, వాళ్లని కాదని దినేశ్ కార్తీక్‌కి ఈ వయసులో టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు గౌతమ్ గంభీర్...

Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కినా కార్తీక్‌కి తుది జట్టులో చోటు దక్కదని అంటున్నాడు గౌతమ్ గంభీర్. పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో టీమిండియా ఎలా ఉండబోతుందో అంచనా వేశాడు గంభీర్. రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్‌‌ను ఓపెనర్‌గా ఎంచుకున్న గంభీర్, విరాట్ కోహ్లీకి వన్ డైన్ ప్లేయర్‌గా చోటు కల్పించాడు...

సూర్యకుమార్ యాదవ్‌‌ని నాలుగో స్థానంలో అవకాశం కల్పించిన గంభీర్, రిషబ్ పంత్‌కి వికెట్‌ కీపర్‌గా అవకాశం కల్పించాడు. సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి రెస్ట్ కల్పించాడు. హార్ధిక్ పాండ్యాకి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అవకాశం ఇచ్చిన గంభీర్, అక్షర్ పటేల్‌కి స్పిన్ ఆల్‌రౌండర్‌గా చోటు కల్పించాడు...


Image credit: PTI

మరో స్పిన్నర్‌గా యజ్వేంద్ర స్పిన్నర్‌కి తుది జట్టులో చోటు ఇచ్చిన గౌతమ్ గంభీర్.. ఫాస్ట్ బౌలర్లుగా హర్షల్ పటేల్, మహ్మద్ షమీలకు ఛాన్స్ ఇచ్చాడు. మూడో ఫాస్ట్ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌కి అవకాశం దక్కొచ్చని అంచనా వేశాడు గౌతమ్ గంభీర్...

Image credit: PTI

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలను దినేశ్ కార్తీక్‌కి అప్పగించాడు గౌతమ్ గంభీర్. అయితే కార్తీక్, 2020 సీజన్ మధ్యలో కేకేఆర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2022లో ఆర్‌సీబీ తరుపున ఆడి, సెలక్టర్లను మెప్పించి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు దినేశ్ కార్తీక్...

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ అంచనా వేస్తున్న భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, యజ్వేంద్ర చాహాల్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్/అర్ష్‌దీప్ సింగ్...
 

Latest Videos

click me!