శుబ్‌మన్ గిల్‌కి అంత సీన్ లేదు! వరల్డ్ నెక్ట్స్ సూపర్ స్టార్ అతనే... - స్టీవ్ స్మిత్ కామెంట్...

Published : Feb 21, 2023, 01:39 PM IST

సునీల్ గవాస్కర్ తర్వాత సచిన్ టెండూల్కర్, రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్.. అంతటి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పరుగులు సాధించి, వరల్డ్ సూపర్ స్టార్లుగా మారారు...  

PREV
15
శుబ్‌మన్ గిల్‌కి అంత సీన్ లేదు! వరల్డ్ నెక్ట్స్ సూపర్ స్టార్ అతనే... - స్టీవ్ స్మిత్ కామెంట్...
Virat Kohli-Shubman Gill

మరి ఫ్యూచర్ సూపర్ స్టార్ ఎవరు? దీనికి చాలామంది శుబ్‌మన్ గిల్ పేరే చెబుతున్నారు. టెస్టుల్లో నిలకడైన ప్రదర్శనతో అదరగొడుతున్న శుబ్‌మన్ గిల్, వన్డేల్లో అదరగొడుతూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డేలో డబుల్ సెంచరీ బాది, ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ - జనవరి 2023’ అవార్డు కూడా గెలిచాడు శుబ్‌మన్ గిల్...

25

టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో సెంచరీలు సాధించిన అతికొద్ది మంది ప్లేయర్లలో ఒకడిగా ఉన్న శుబ్‌మన్ గిల్, వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన అత్యంత అరుదైన ప్లేయర్ల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. ఇంత చేసీ శుబ్‌మన్ గిల్ వయసు 23 ఏళ్లే...
 

35

అలాగే 23 ఏళ్ల ఇంగ్లాండ్ బ్యాటర్ హారీ బ్రూక్ కూడా ఆరంగ్రేటం నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు...

45

‘శుబ్‌మన్ గిల్ బాగా ఆడుతున్నాడు. ఇంత తక్కువ కెరీర్‌లో ఇన్ని రికార్డులు కొల్లగొట్టడం అంటే తేలికైన విషయం కాదు. అయితే హారీ బ్రూక్ సూపర్ స్టార్. అతను వరల్డ్ క్రికెట్‌లో నెక్ట్స్ సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతని టెక్నిక్, బ్యాటింగ్ అలా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్...
 

55
Harry Brook

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా స్టీవ్ స్మిత్ అభిప్రాయంతో ఏకీభవించాడు. ‘పాకిస్తాన్ టూర్ నుంచి హారీ బ్రూక్ అదరగొడుతున్నాడు. అదే ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. అతనిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. అతను గ్లోబల్ సూపర్ స్టార్ అవుతాడు...అందులో ఎలాంటి డౌట్ లేదు...’ అంటూ కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్.. 

Read more Photos on
click me!

Recommended Stories