ధోనీ, ఐపీఎల్ ఎంట్రీకి 15 ఏళ్లు... 2023 సీజన్‌తో మాహీ శకానికి తెర! ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కి నిరాశ...

First Published Feb 21, 2023, 1:16 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని స్టార్. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్. ఐపీఎల్ 2008 వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ధోనీ, ఐపీఎల్ కెరీర్‌కి 15 ఏళ్ల పూర్తయ్యాయి...
 

Image credit: PTI

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్ ప్లేయర్లను ఫ్రాంఛైజీలు, డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేశాయి..
 

అయితే కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, వేలంలో పాల్గొన్నాడు. ధోనీని కొనుగోలు చేయడానికి 8 ఫ్రాంఛైజీలు కూడా ముందుకొచ్చాయి. ఓ ప్లేయర్ కోసం అన్ని ఫ్రాంఛైజీలు పోటీపడడం అదే తొలిసారి, ఆఖరిసారి కూడా...

Latest Videos


Image credit: PTI

ఐపీఎల్ 2008 వేలంలో రూ.9 కోట్ల 50 లక్షలకు మహేంద్ర సింగ్ ధోనీని కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. రూ.9.8 కోట్లకు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ని కొనుగోలు చేసినా ధోనీకే కెప్టెన్సీ దక్కింది..

13 సీజన్లుగా (బ్యాన్ పడిన రెండేళ్లు మినహా ఇస్తే) ఓ ఫ్రాంఛైజీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఏకైక ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీయే. 2008 నుంచి 2022 వరకూ కెప్టెన్‌ని మార్చే విషయంలో ఆలోచన కూడా చేయలేదు సీఎస్‌కే...

Dhoni CSK

ప్రస్తుతం ఐపీఎల్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంఛైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ ముందు వరుసలో ఉంటుంది. సీఎస్‌కేకి అంతటి క్రేజ్ రావడానికి ఏకైక కారణం ఆ టీమ్‌లో ధోనీ ఉండడమే...

2008 నుంచి 2020 వరకూ ఆడిన ప్రతీ సీజన్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ని నాకౌట్ స్టేజీకి తీసుకెళ్లాడు ధోనీ. 13 సీజన్లలో 11 సార్లు ప్లేఆఫ్స్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, 9 సార్లు ఫైనల్ ఆడి 4 సార్లు టైటిల్ గెలిచింది..

ధోనీకి ఐపీఎల్ 2023 సీజన్ ఆఖరిది. ఇప్పటికే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ విషయాన్ని ఖరారు చేసింది. ధోనీ ‘ఫేర్‌వెల్ సీజన్’ అంటూ ఐపీఎల్ 2023 సీజన్‌కి ప్రచారం కల్పిస్తోంది...

అయితే హైదరాబాద్‌లో ఉన్న ధోనీ ఫ్యాన్స్‌కి మాత్రం నిరాశ ఎదురుకానుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడడం లేదు చెన్నై సూపర్ కింగ్స్..
 

హైదరాబాద్, చెన్నై రెండూ వేర్వేరు సెట్లలో ఉండడంతో ఇరు జట్ల మధ్య ఒకే మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 21న చెన్నైలో హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది...

దీంతో ఆఖరి సీజన్‌లో ధోనీ బ్యాటింగ్ చూడాలంటే హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్, చెన్నైకి వెళ్లాల్సిందే. లేదా టీవీల్లో చూసి ఆనందించాల్సి ఉంటుంది..

click me!