ఒక్క రూపాయి తీసుకోను! సాయం కావాలంటే చెప్పండి!... ఆసీస్‌ టీమ్‌కి ఆఫర్ ఇచ్చిన మాథ్యూ హేడెన్...

Published : Feb 21, 2023, 12:21 PM IST

ఐసీసీ నెం.1 టెస్టు టీమ్‌ హోదాలో ఇండియాలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా... రెండు టెస్టులు ముగిసే సరికి ఆ పొజిషన్‌ని కోల్పోయే ప్రమాదంలో పడింది. వరుసగా రెండు టెస్టుల్లోనూ చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా జట్టు, బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో తడబడుతోంది...  

PREV
16
ఒక్క రూపాయి తీసుకోను! సాయం కావాలంటే చెప్పండి!... ఆసీస్‌ టీమ్‌కి ఆఫర్ ఇచ్చిన మాథ్యూ హేడెన్...

నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన చోట, ఆస్ట్రేలియా బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా 300 పరుగులు చేయలేకపోయారు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 1 పరుగు ఆధిక్యం దక్కినా దాన్ని సరిగ్గా వాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది ఆసీస్...

26
India v Australia 2nd Test

12 ఓవర్లలో 61/1 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియా జట్టు, మరో 52 పరుగులు జోడించి 113 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లను అశ్విన్, అక్షర్ పటేల్ ఎక్కువగా ఇబ్బంది పెడతారని అనుకుంటే రవీంద్ర జడేజా ఏకంగా 7 వికెట్లు తీసి టాప్ టీమ్‌ని తెగ ఇబ్బందిపెడుతున్నాడు..

36
Matthew Hayden

2004లో చివరిగా ఇండియాలో టెస్టు సిరీస్ నెగ్గింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత 19 ఏళ్లుగా ఆ ఫీట్ సాధించలేకపోయింది. 2004లో ఇండియాలో టెస్టు సిరీస్ నెగ్గిన ఆసీస్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న మాథ్యూ హేడెన్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా టీమ్‌కి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించాడు.. 

46
Image credit: Getty

‘ఆసీస్ టీమ్‌కి కావాల్సిన సాయం అందచేసేందుకు నేను నూటికి నూరు శాతం సిద్ధంగా ఉన్నా. ఉదయం రమ్మని చెప్పినా, అర్ధరాత్రి బయలుదేరమని చెప్పినా నాకు ఓకే. నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. ఇండియాలో బ్యాటింగ్ చేయడం అంత తేలికైన విషయం కాదు...

56
Matthew Hayden and Justin Langer

భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగడం వల్లనో లేక వారి బౌలింగ్‌లో పూర్తిగా డిఫెన్స్ ఆడడం వల్లనో సక్సెస్ దక్కదు. భారత్‌లో పరుగులు చేయాలంటే ముందుగా వారిని గౌరవించాలి. సింగిల్స్ తీస్తూ స్ట్రైయిక్ రొటేట్ చేస్తూ ఉంటే భారత బౌలర్లు కాస్త ఇబ్బంది పెడతారు..

66
Image credit: Wikimedia Commons

టీమిండియాలో 18 మ్యాచులు ఆడిన మాథ్యూ హేడెన్, 59 యావరేజ్‌తో 1888 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు చేశాడు...

click me!

Recommended Stories