కొన్నిసార్లు ఏం చేయకుండా కూడా చూడండి.. అని ఓ చాక్లెట్ యాడ్‌లో చెప్పినట్టుగా, గత నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న కేన్ విలియంసన్.. ఏమీ చేయకుండానే లక్కీగా ఐసీసీ నెం.1 టెస్టు బ్యాటర్‌గా అవతరించాడు..
గత వారం టాప్ ప్లేస్‌లో ఉన్న జో రూట్, లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 10, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఏకంగా నాలుగు స్థానాలు దిగజారిన జో రూట్, టాప్ 5లో స్థిరపడ్డాడు..
26
Kane Williamson
దాదాపు నాలుగేళ్ల తర్వాత టాప్ 5 నుంచి కిందకి పడిపోయిన స్టీవ్ స్మిత్, రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 110, రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేసి ... మళ్లీ టాప్ 2లోకి దూసుకొచ్చాడు. మూడో టెస్టులో స్మిత్ బ్యాటు నుంచి సరైన పర్ఫామెన్స్ వస్తే... టాప్ ప్లేస్‌కి ఎగబాకుతాడు..
36
Steve Smith
ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కేన్ విలియంసన్, ప్రస్తుతం టీమ్‌కి దూరంగా ఉన్నాడు. మిగిలిన బ్యాటర్లు ఫెయిల్ కావడంతో టాప్ ప్లేస్‌కి వెళ్లిన కేన్ విలియంసన్ ఖాతాలో ప్రస్తుతం 883 పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ 882 పాయింట్లు సాధించాయి. ఈ ఇద్దరికీ ఉన్న తేడా కేవలం 1 పాయింట్ మాత్రమే.
46
యాషెస్ సిరీస్‌కి ముందు టాప్ ప్లేస్‌లో ఉన్న ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 873 పాయింట్లతో మూడో స్థానంలో ఉంటే, ట్రావిస్ హెడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. జో రూట్ ఐదో స్థానంలో ఉంటే బాబర్ ఆజమ్ ఆరో స్థానానికి పడిపోయాడు..
56
టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే టాప్ 10లో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, టెస్టు నెం.1 బౌలర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకోగా ప్యాట్ కమ్మిన్స్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. టాప్ 8లో జస్ప్రిత్ బుమ్రా, టాప్ 9లో రవీంద్ర జడేజా ఉన్నారు..
66
Image credit: Getty
టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా టాప్‌లో ఉంటే, రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. షకీబ్ అల్ హసన్ టాప్ 3లో ఉంటే, బెన్ స్టోక్స్ టాప్ 4కి వచ్చాడు. అక్షర్ పటేల్ టాప్ 5లో ఉన్నాడు...