రంజీ ట్రోఫీకి దూరంగా హార్ధిక్ పాండ్యా... దాని కోసం టెస్టులకు దూరంగా ఉండాలని...

First Published Feb 7, 2022, 1:00 PM IST

గాయం కారణంగా ఫామ్ కోల్పోయి, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, రంజీ ట్రోఫీలో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నాడు...

ఐపీఎల్‌కి ముందు పేలవ ఫామ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయిన క్రికెటర్లు, మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రంజీ ట్రోఫీలో పాల్గొని, సత్తా చాటడమే ఏకైక దారి...

టెస్టుల్లో వరుసగా విఫలమవుతూ వస్తున్న సీనియర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే కూడా ఫిబ్రవరి 10 నుంచి మొదలయ్యే రంజీ ట్రోఫీలో పాల్గొనబోతున్నారు...

శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కి ముందు జరిగే రంజీ ట్రోఫీలో రాణించడాన్ని బట్టే పూజారా, రహానేల టెస్టు కెరీర్ ఆధారపడి ఉంటుంది... 

బరోడా క్రికెట్ టీమ్‌కి ప్రకటించిన జట్టులో హార్ధిక్ పాండ్యా పేరు లేకపోవడంతో అతను సుదీర్ఘ ఫార్మాట్‌‌పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది...

బరోడా జట్టుకి కేదార్ దేవ్‌ధర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతుంటే, విష్ణు సోలంకి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్ధిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యాకి ఈ జట్టులో చోటు దక్కింది...

వెన్నెముక సర్జరీ తర్వాత దాదాపు రెండు ఐపీఎల్ సీజన్లలో బౌలింగ్ వేయలేకపోయిన హార్ధిక్ పాండ్యాను టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి...

బౌలింగ్ చేయడానికి శరీరం సహకరించకపోవడంతో పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట హార్ధిక్ పాండ్యా... అందుకే రంజీ ట్రోఫీకి దూరంగా ఉండాలని భావిస్తున్నాడట...

వైట్ బాల్ క్రికెట్‌పై పూర్తి ఫోకస్ పెట్టేందుకు వీలుగా అవసరమైతే టెస్టులకు దూరంగా ఉండాలని భావిస్తున్న హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాల్గొని, టీమిండియా విజయం అందించడమే తన ముందున్న లక్ష్యం అంటూ కామెంట్ చేశాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా...

హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ, అతనికి రూ.15 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. హార్ధిక్‌తో పాటు రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్‌లను డ్రాఫ్ట్‌లుగా ఎంచుకున్న అహ్మదాబాద్...

click me!