హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండర్ కాదు, అతను టెస్టుల్లోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమే...

First Published Jul 15, 2021, 3:26 PM IST

ఐపీఎల్ నుంచి భారత జట్టులోకి బాణంలా దూసుకొచ్చాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. కెరీర్ ఆరంభంలోనే టెస్టులు, వన్డేల్లో, టీ20ల్లో చోటు దక్కించుకుని, కీలక సభ్యుడిగా మారాడు. అయితే ఇప్పుడు అతను కేవలం వన్డే, టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు...

2019 వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత సుదీర్ఘకాలం జట్టుకి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని వన్డే, టీ20ల్లో ఎంట్రీ ఇచ్చినా, టెస్టుల్లో మాత్రం స్థానం సంపాదించలేకపోతున్నాడు...
undefined
ఆస్ట్రేలియా టూర్‌లో వన్డేల్లో, టీ20ల్లో అదరగొట్టి, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచిన హార్ధిక్ పాండ్యా... 2018లో ఇంగ్లాండ్‌పై చివరి టెస్టు ఆడాడు...
undefined
‘హార్ధిక్ పాండ్యా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. అయితే అతను టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే, అతను టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వడం కష్టమే... అయితే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం పాండ్యాకి కొత్తేమీ కాదు.
undefined
2016 టీ20 వరల్డ్‌కప్ తర్వాత హార్ధిక్ పాండ్యా ఫామ్ కోల్పోయి, జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అయితే అతను కష్టపడి రీఎంట్ీ ఇచ్చాడు. బరోడా జట్టులోతను చాలా హెవీవర్కవుట్స్ చేశాడు...
undefined
భారత్ ఏ తరుపున ఆడి, రాణించి తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. పాండ్యా పరిస్థితికి కారణం ఒకటే... అతను చిన్నతనం నుంచి ఆల్‌రౌండర్ కాదు. చిన్నప్పటి నుంచి కేవలం బ్యాట్స్‌మెన్‌గానే ఉండేవాడు హార్ధిక్.. అయితే భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే బౌలింగ్ కూడా అవసరమని బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు.
undefined
నాకు తెలిసి 16 ఏళ్ల వయసులో ఫాస్ట్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు. చాలా ఆలస్యంగా బాల్ అందుకోవడంతో అతని శరీరం, ఆ ప్రెషర్‌ను తట్టుకోలేకపోతోంది... అతను సుదీర్ఘ కాలం టెస్టుల్లో కొనసాగాలంటే మాత్రం బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెడితే బెటర్.
undefined
లేదంటే కండరాలపై ఒత్తిడి పడకుండా మేనేజ్ చేయడం తెలుసుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, బరోడా మాజీ కోచ్ జితిందర్ సింగ్..
undefined
శ్రీలంక టూర్‌కి హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఎన్నిక కాకపోవడంపై అతని చిన్ననాటి కోచ్ అయితే జితిందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు... టెస్టుల్లో 11 మ్యాచులు ఆడిన హార్ధిక్ పాండ్యా, 532 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు.
undefined
click me!