రిషబ్ పంత్‌కి కరోనా పాజిటివ్... ఫుట్‌బాల్ మ్యాచులు చూడడానికి వెళ్లి...

Published : Jul 15, 2021, 11:38 AM IST

ఇంగ్లాండ్ టూర్‌లో ఓ భారత ప్లేయర్ కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతను మరెవరో కాదు, యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ రిషబ్ పంత్. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత బయో బబుల్ నుంచి బయటికి వెళ్లిన రిషబ్ పంత్, ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు సమాచారం...

PREV
17
రిషబ్ పంత్‌కి కరోనా పాజిటివ్... ఫుట్‌బాల్ మ్యాచులు చూడడానికి వెళ్లి...

లండన్‌లో జరిగిన యూరో 2020 ఫుట్‌బాల్ మ్యాచులకు కూడా హాజరైన రిషబ్ పంత్, అక్కడ భౌతిక దూరం పాటించకుండా అభిమానులతో కలిసి సెల్పీలకు ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాతే అతనికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం...

27

దాదాపు 8 రోజుల కిందటే రిషబ్ పంత్‌కి కరోనా పాజిటివ్ వచ్చిందని, అతను అప్పటి నుంచే ఐసోలేషన్‌లో ఉంటూ భారత జట్టు మేనేజ్‌మెంట్‌తో టచ్‌లో ఉన్నాడని తెలిసింది... ప్రస్తుతం అతను బంధువుల ఇంట్లోనే ఉండి, చికిత్స తీసుకుంటున్నాడు.

37

కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత జట్టులో ఎవ్వరినీ కలవని రిషబ్ పంత్, టీమ్ హోటల్‌కి కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడట. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా మెరుగైందని త్వరలోనే మరోసారి కరోనా టెస్టులకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది...

47

రిషబ్ పంత్‌తో పాటు మరో క్రికెటర్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వార్తలు వచ్చినా, వాటిలో నిజం లేదని విశ్వనీయ వర్గాల సమాచారం... పంత్ త్వరలోనే కోలుకుని, బయో బబుల్‌లో చేరతాడని బీసీసీఐ అధికారులు తెలియచేశారు.

57

జూలై 20 నుంచి ఓ కౌంటీ క్లబ్‌తో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. అయితే రిషబ్ పంత్ ఆ సమయానికల్లా కోలుకోవడం కష్టం. ఒకవేళ కోలుకున్నా, అతనికి తగినంత విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతో సాహాను ఆడించాలని టీమిండియా భావిస్తోందట.

67

గత ఆస్ట్రేలియా టూర్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

77

రిషబ్ పంత్‌తో పాటు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను కూడా ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు. ఐపీఎల్ 2021 సమయంలో సాహాకి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే...

click me!

Recommended Stories