ఈవెంట్‌లో భాగంగా హోస్ట్ రామ్ చరణ్‌తో ఒక ఇంట్రెస్టింగ్ రాపిడ్ ఫైర్ గేమ్ ఆడించారు. ఇందులో భాగంగా టీమిండియా స్టార్ క్రికెటర్ల పేర్లు చెప్పి, వారి గురించి ఒక్క ముక్కలో చెప్పమన్నారు. చరణ్ కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఆన్సర్స్ ఇచ్చారు.
సచిన్ టెండూల్కర్ గురించి ‘లెజెండరీ రన్’ అని, ధోనీని ‘కూల్ అండ్ కామ్’ అని, రోహిత్ శర్మను ‘అందరివాడు’ అని, విరాట్ కోహ్లీని ‘ఫైర్’ అంటూ క్రేజీగా డిస్క్రైబ్ చేశారు. కానీ, అసలు ట్విస్ట్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు వచ్చినప్పుడు ఎదురైంది. "నేను బుమ్రాకు పెద్ద ఫ్యాన్‌ని. నాకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం, మీరు ఫుట్‌బాల్‌ను ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు" అంటూ చరణ్ పొరపాటుగా మాట్లాడేశారు.
వరల్డ్ క్లాస్ క్రికెట్ బౌలర్ అయిన బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్ అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాదు, అదే ఫ్లోలో భోపాల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 'బీహార్ ప్రజలు' అని కూడా అనేశారు. వెంటనే యాంకర్ అలర్ట్ అయి ఆ తప్పును సరిదిద్దారు.