నా తప్పేం లేదు, నన్ను అందుకే టీ20 వరల్డ్ కప్‌కి సెలక్ట్ చేశారు... హార్ధిక్ పాండ్యా రియాక్షన్...

First Published Jan 31, 2022, 4:40 PM IST

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో హార్ధిక్ పాండ్యా పేరు ఉండడం, అతని నుంచి టోర్నీలో చెప్పుకోదగ్గ పర్పామెన్స్ రాకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. హార్ధిక్ పాండ్యా స్థానంలో వెంకటేశ్ అయ్యర్,హర్షల్ పటేల్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇచ్చి ఉంటే, పరిస్థితి ఇలా ఉండేది కాదని ట్రోల్స్ వచ్చాయి...

Hardik Pandya

ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యాని కేవలం మెంటర్ ఎమ్మెస్ ధోనీ సిఫారసు కారణంగానే సెలక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి...

హార్ధిక్ పాండ్యా ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ ముగిసిన తర్వాత అతన్ని టీ20 వరల్డ్‌ కప్ జట్టు నుంచి తొలగించాలని సెలక్టర్లు భావించినా, మెంటర్ ఎమ్మెస్ ధోనీ అడ్డుకున్నాడనే వార్త తెగ వైరల్ అయ్యింది...

‘టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఓటమికి అందరూ నేనే కారణమన్నట్టు మాట్లాడారు. ఇప్పటికీ ఆ ట్రోల్స్‌ నన్ను బాధపెడుతూనే ఉన్నాయి. అయితే వాటన్నింటికీ నేను నా ఆటతోనే సమాధానం చెబుతాను...

వరల్డ్ కప్‌కి నన్ను సెలక్ట్ చేసింది కేవలం బ్యాటర్‌గానే, అంతేకానీ ఆల్‌రౌండర్‌గా కాదు. నన్ను బౌలింగ్ చేయమని సెలక్టర్లు కానీ, టీమ్ మేనేజ్‌మెంట్‌కానీ చెప్పింది లేదు...

మొదటి మ్యాచ్‌ సమయానికే నేను బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా ఉన్నా. రెండో మ్యాచ్‌‌లో అయినా బౌలింగ్ ఇస్తారేమోనని వెయిట్ చేశా. అయితే రెండు మ్యాచుల్లోనూ నాకు ఆ అవకాశం దక్కలేదు...

ఇప్పుడు నా ఫోకస్ మొత్తం టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీపైనే ఉంది. దేశం కోసం వరల్డ్‌కప్ గెలవాలని అనుకుంటున్నా. అదే జరిగితే నాకంటే సంతోషించే వ్యక్తి, గర్వించే వ్యక్తి మరొకరు ఉండరు...

నాలో ఆ కోరిక అలా ఉండిపోయింది. ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఆడా. విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ దగ్గర్నుంచి చూశా. ఆ అనుభవంతోనే అహ్మదాబాద్ జట్టుకి కెప్టెన్‌గా సక్సెస్ అవుతానన్న నమ్మకం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా...

అయితే తాజాగా హార్ధిక్ పాండ్యా చేసిన కామెంట్లపై కూడా ట్రోలింగ్ వస్తోంది. 2021 టీ20 వరల్డ్‌ కప్ టోర్నీ తర్వాత జరిగిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్‌లలో హార్ధిక్ పాండ్యాకి చోటు దక్కలేదు...

2022 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ గెలవాలంటే ముందు టీమ్‌కి సెలక్ట్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలో ఆలోచించు ముందు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు టీమిండియా అభిమానులు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా రాబోతున్న అహ్మదాబాద్ జట్టు, కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాని రూ.15 కోట్లు, ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను రూ.15 కోట్లు, బ్యాట్స్‌‌మెన్ శుబ్‌మన్ గిల్‌ని రూ.8 కోట్లకు డ్రాఫ్ట్‌లుగా కొనుగోలు చేసింది...

click me!