ఎందుకండీ ఈ ఇద్దరూ ఉండి... సీనియర్లు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా మళ్లీ ఫెయిల్...

Published : Nov 28, 2021, 11:06 AM IST

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే, తాత్కాలిక వైస్ కెప్టెన్ ఛతేశ్వర్ పూజారా... ఎంతో అనుభవం ఉన్న ఈ ఇద్దరూ సీనియర్లు మరోసారి ఘోరంగా ఫెయిల్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్తో కూస్తో పరుగులు చేసిన ఈ సీనియర్ ద్వయం, రెండో ఇన్నింగ్స్‌లో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్‌ను రిపీట్ చేశారు.

PREV
110
ఎందుకండీ ఈ ఇద్దరూ ఉండి... సీనియర్లు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా మళ్లీ ఫెయిల్...

కాన్పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న టీమిండియాకి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఓవర్‌నైట్ స్కోరు 14/1 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కేల్ జెమ్మీసన్ వేసిన నాలుగో రోజు మొదటి ఓవర్‌లో ఛతేశ్వర్ పూజారా, మయాంక్ అగర్వాల్ చెరో ఫోర్ బాదాడు...

210

జెమ్మీసన్ ఓవర్‌లో పూజారా అవుట్ కావడంతో 32 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. జెమ్మీసన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌కి అప్పీలు చేసింది న్యూజిలాండ్. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకున్న కివీస్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. 

310

ఆ తర్వాత అజింకా రహానే 15 బంతులాడి 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తాను ఆడిన మొదటి 13 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయిన అజింకా రహానే, 14వ బంతికి ఫోర్ బాది, 15వ బంతికి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

410

వన్‌డౌన్‌లో సెంచరీ లేకుండా ఛతేశ్వర్ పూజారా 39 ఇన్నింగ్స్‌లు పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో మూడో స్థానంలో ఆడుతూ, సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు ఛతేశ్వర్ పూజారా...

510

1968 నుంచి 1974 వరకూ అజిత్ వాడేకర్ 37 ఇన్నింగ్స్‌లు పాటు సెంచరీ లేకుండా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగా, 2019-2021 సీజన్‌లో పూజారా ఈ రికార్డును సమం చేశాడు...

610

2013-16 సీజన్‌లో 32 ఇన్నింగ్స్‌లు పాటు సెంచరీ లేకుండా గడిపేసిన ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారా... తన చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు...

710

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లో ఆడిన బ్యాట్స్‌మెన్‌గా ఛతేశ్వర్ పూజారా టాప్‌లో నిలిచాడు. పూజారా 40 ఇన్నింగ్స్‌లు ఆడిన సెంచరీ చేయలేకపోతే, జాసన్ హోల్డర్ 28, జానీ బెయిర్ స్టో 27 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయలేకపోయారు. 

810


2021 సీజన్‌లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడం అజింకా రహానేకి ఇది 8వ సారి. 2015లో ఆరుసార్లు, 2014లో ఐదుసార్లు టెస్టుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకకే అవుట్ అయ్యాడు అజింకా రహానే...

910

2016లో న్యూజిలాండ్‌పై 188 పరుగులు చేసిన కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేసిన అజింకా రహానే, ఆ తర్వాత 50 టెస్టుల్లో కేవలం 32.73 సగటుతో పరుగులు చేస్తుండడం విశేషం. 

1010

పేలవమైన ఫామ్ కారణంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే... ముంబై టెస్టులో ఆడితే టీమిండియాపై తీవ్రమైన ట్రోలింగ్ రావడం గ్యారెంటీ...

click me!

Recommended Stories