ముంబైలో అత్యంత ఖరీదైన ఏరియా అయిన బాంద్రాలోని స్వాంకీ హోమ్‌లో రూ.30 కోట్లు పెట్టి ఇంటిని కొనుగోలు చేశారు హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా...
28
పాండ్యా బ్రదర్స్ ఇంటి పక్కనే బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, అతని ప్రియురాలు, బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠానీ ఇళ్లు కూడా ఉండడం విశేషం...
38
బంద్రాలోని రుస్తుంజీ పారామోంట్ కాంప్లెక్స్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఈ ఇంటిలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వరల్డ్ క్లాస్ సౌకర్యాలన్నీ ఉన్నాయి...
48
రాక్ క్లైంబింగ్‌తో పాటు సెపరేట్ గేమ్ రూమ్, జిమ్, పోడియం, స్పా వంటి సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయి...
58
అంతేకాకుండా పాండ్యా బ్రదర్స్ ఇంటి నుంచి ముంబై సిటీతో పాటు అరేబియా సముద్రాన్ని వీక్షించొచ్చు...
68
మూడేళ్లుగా ముంబై ఇండియన్స్ నుంచి ఏటా రూ.11 కోట్లు అందుకుంటున్నాడు స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. అలాగే అతని అన్న కృనాల్ పాండ్యా కూడా ఏటా రూ.8.8 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు...
78
క్రికెటర్‌గా సక్సెస్ కాకముందు ఓ అద్దె ఇంట్లో ఉంటూ, అనేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న పాండ్యా బ్రదర్స్... ఇప్పుడు అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిన క్రికెటర్లలో ఒకరిగా నిలవడం విశేషం...
88
సొంతంగా ప్రైవేట్ జెట్ విమానం కలిగిన క్రికెటర్లలో ఒకడిగా ఉన్న హార్ధిక్ పాండ్యా... ఇప్పుడు అన్నతో కలిసి ఖరీదైన ఇంటికి యజమాని కూడా అయ్యాడు...