వాళ్లకి నేనేంటో చూపిస్తా, అంత చేసినా నన్ను మరిచిపోయారా... సౌతాఫ్రికా క్రికెటర్ డుప్లిసిస్...

First Published Dec 25, 2021, 2:19 PM IST

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో అండర్‌ డాగ్స్‌గా బరిలో దిగిన గ్రూప్ స్టేజ్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది సౌతాఫ్రికా. అయితే సీనియర్ బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డుప్లిసిస్‌కి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

ఏబీ డివిల్లియర్స్ రిటైర్మెంట్ తర్వాత సరైన విజయాలు అందుకోలేకపోతున్న సౌతాఫ్రికా, 2019 వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో ఘోరమైన ప్రదర్శన ఇచ్చింది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలోనూ సౌతాఫ్రికాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం తప్ప మిగిలిన అన్ని మ్యాచుల్లో అద్భుతంగా రాణించింది సఫారీ టీమ్...

గ్రూప్ స్టేజ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో సమానంగా ఐదింట్లో నాలుగు మ్యాచుల్లో విజయం సాధించినా నెట్ రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది సౌతాఫ్రికా...

అయితే వైట్ బాల్ క్రికెట్‌లో జట్టుకి అందుబాటులో ఉండేందుకు టెస్టు ఫార్మాట్‌ నుంచి తప్పుకున్న ఫాఫ్ డుప్లిసిస్‌కి సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కకపోవడం... అందర్నీ షాక్‌కి గురి చేసింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 633 పరుగులు చేసి, కేవలం 2 పరుగుల తేడాతో ఆరెంజ్ క్యాప్ కోల్పోయాడు ఫాఫ్ డుప్లిసిస్. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్‌లో 86 పరుగులు చేసి, ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు డుప్లిసిస్...

‘నాలో మంచి బ్యాటింగ్ వాయిస్ ఉంది, అలాగే చెడ్డ బ్యాటింగ్ వాయిస్ కూడా ఉంది. ఉదాహరణకి గత ఐపీఎల్‌లో నేను బాగా ఆడాను...

ఐపీఎల్ ఆరంభం నుంచే టాప్ 3లో ఉండాలని లక్ష్యం పెట్టుకుని బ్యాటింగ్ చేశాను. అందుకే దానికి తగ్గట్టుగా పరుగులు చేస్తూ, టాప్ 2తో సీజన్‌ని ముగించాను...

ఈ సీజన్‌ జరిగినన్ని రోజులు నా మదిలో అనేక ఆలోచనలు నడిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నేను ఒక్క పరుగుకే అవుట్ అయ్యాను...

అంతే సోషల్ మీడియాలో అందరూ నన్ను ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆ పర్ఫామెన్స్ కారణంగా నేను ఆరో స్థానానికి పడిపోయాను కూడా...

మేం ఆ మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌కి అర్హత సాధించా. ఫైనల్ మ్యాచ్‌లో నేను పరుగులు చేసి, ఎలాగైనా టాప్‌లో వెళ్లాలని అనుకున్నా. నా విలువేంటో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకి తెలియచేయాలనే కసితో బ్యాటింగ్ చేశా...

నువ్వు ఇది చేయలేవు, నువ్వు అసలే ఫామ్‌లో లేవు... అంటూ నా నెగిటివ్ ఇన్నర్ వాయిస్ చెబుతూ ఉంది. అయితే దాన్ని గెలవాలనే కసితో పాజిటివ్ వాయిస్‌తో బరిలో దిగాను...

40 పరుగులు చేస్తే టాప్ 3కి వెళ్తాను, 83 పరుగులు చేస్తే నెం.1కి వెళ్తా, ఆరెంజ్ క్యాప్ గెలుస్తా... అప్పుడు కానీ నాలో ఇంకా సత్తా చావలేదని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డుకి తెలుస్తుంది...

ఇలా అనేక ఆలోచనలు నన్ను చుట్టేశాయి. ఫైనల్‌లో నేను చేసిన పరుగులు నాకు సంతృప్తినిచ్చాను. అయినా క్రికెట్ సౌతాఫ్రికా నన్ను పట్టించుకోకపోవడం తీవ్రంగా బాధపెట్టింది...’ అంటూ చెప్పుకొచ్చాడు ఫాఫ్ డుప్లిసిస్...

click me!