గంగూలీకి, ధోనీకి ఉన్న తేడా అదే, ఆ ఇద్దరి కెప్టెన్సీలో... రిటైర్మెంట్ తర్వాత హర్భజన్ సింగ్ కామెంట్స్...

First Published Dec 25, 2021, 10:20 AM IST

100కి పైగా టెస్టులు, 700+ పైగా అంతర్జాతీయ వికెట్లు తీసిన భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, టీమిండియాలో ప్లేస్ కోసం ఐదేళ్లు ఎదురుచూసి, ఫెయిర్‌వెల్ మ్యాచ్ లేకుండానే నిరాశగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రిటైర్మెంట్ తర్వాత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఎమ్మెస్ ధోనీల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు హర్భజన్...

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2003 వన్డే వరల్డ్‌కప్ ఆడిన హర్భజన్ సింగ్, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో 2007 వన్డే వరల్డ్‌కప్ ఆడాడు...

ఆ తర్వాత ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు హర్భజన్ సింగ్...

‘నా కెరీర్ మొదలైంది సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే. దాదా కెప్టెన్సీలో ఓ అనామక ప్లేయర్‌గా నేను టీమ్‌లోకి వచ్చాను. ఎమ్మెస్ ధోనీ కెప్టెన్‌ అయ్యే సమయానికి నేను ఎంతో కొంత సాధించాను...

కాబట్టి ఇద్దరి కెప్టెన్సీలో ఆడడానికి చాలా వ్యత్యాసం ఉంది. దాదాకి నా స్కిల్స్ గురించి బాగా తెలుసు, అయితే ఎలా రాణిస్తాననేది తెలీదు...

అదే ధోనీకి నా స్కిల్స్‌తో పాటు ఎలా బౌలింగ్ చేస్తాను, ఎక్కడ బౌలింగ్ చేస్తాననే విషయాలన్నీ బాగా తెలుసు. అతను జట్టులోకి రాకముందే నేను టీమిండియాకి మ్యాచులు గెలిపించానని మాహీకి బాగా తెలుసు...

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో కూడా కొన్ని మ్యాచులను గెలిపించాను. జీవితంలో అయినా, ప్రొఫెషన్‌లో అయినా మనల్ని సక్రమ మార్గంలో నడిపించే ఓ వ్యక్తి అవసరం. నా విషయంలో అది సౌరవ్ గంగూలీయే...

గంగూలీ, నన్ను ఆడించాలని సెలక్టర్లతో పట్టుబట్టి ఉండకపోతే, ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉండేవాడిని కాదేమో. అందుకే నేను సాధించిన విజయాల వెనక సౌరవ్ లాంటి లీడర్ ఉన్నాడని గర్వంగా చెబుతాను...

అవును, ధోనీ కూడా మంచి కెప్టెన్. సౌరవ్ గంగూలీ వారసత్వాన్ని మాహీ కొనసాగించాడు. మాహీ కెప్టెన్సీలో ఆడడాన్ని కూడా ఎంజాయ్ చేశాను...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...

ఎమ్మెస్ ధోనీకి, హర్భజన్ సింగ్‌కీ మధ్య మనస్ఫర్థలు ఉన్నాయని, తనని టీమిండియాకి దూరం చేశాడనే ఉద్దేశంతో మాహీ అంటే భజ్జీకి పడదని వార్తలు వచ్చాయి...

ఐపీఎల్ 2020 సీజన్ సమయంలోనూ కొందరు ఆడితే ఈ వయసులో కూడా అద్భుతంగా ఆడుతున్నావని అంటారు, మరికొందరికేమో కేవలం వయసు కారణంగా జట్టుకి దూరం చేస్తారు... అంటూ మాహీ గురించి వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు హర్భజన్ సింగ్.

click me!