Hardik Pandya: భారత జట్టులో ఉన్న అతి తక్కువ మంది ఆల్ రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడు. కొద్దికాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న పాండ్యా పై పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ సంచలన కామెంట్స్ చేశాడు.
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శారీరకంగా పాండ్యా చాలా బలహీనంగా ఉన్నాడని, ఇలా అయితే ఒక్క ఫార్మాట్ లో కూడా అతడు రాణించలేడని అభిప్రాయపడ్డాడు.
27
తన యూట్యూబ్ ఛానెల్ లో భట్ మాట్లాడుతూ... ‘హార్దిక్ పాండ్యా బాడీ చాలా వీక్ గా ఉంది. ఇలా ఉంటే అతడు కనీసం ఒక్క ఫార్మాట్ లో కూడా రాణించలేడు. అతడు తన శరీర దృఢత్వం మీద దృష్టి సారించాలి. పాండ్యా తన కండలను, బరువును పెంచుకోవాలి.
37
పాండ్యా తిరిగి 4 ఓవర్ల కోటా కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడని, అతడు కష్టపడితేనే నిలదొక్కుకుంటాడని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పాడు..’ అని భట్ అన్నాడు.
47
వెన్నెముక శస్త్ర చికిత్స తర్వాత పాండ్యాలో మునుపటి ఫామ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో అతడు జట్టుకు తిరిగి వచ్చినా సరైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు.
57
ఫామ్ కోల్పోవడంతో.. ఇక తాను ఐపీఎల్ ఆడటం ప్రారంభించినప్పట్నుంచి అండగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు.. ఈసారి అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు.
67
ముంబై ఇండియన్స్ తరఫున 92 మ్యాచులు ఆడిన హార్ధిక్.. 1,476 పరుగులు చేశాడు. అంతేగాక బౌలింగ్ లో 42 వికెట్లు పడగొట్టాడు.
77
ఇక టీ20 ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ కూడా అతడిని పక్కనబెట్టింది. న్యూజిలాండ్ తో టీ20, టెస్టు సిరీస్ కు అతడిని ఎంపిక చేయలేదు. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్ కు కూడా పాండ్యా ఎంపికయ్యేది అనుమానంగానే ఉంది.