సంజూకు షాక్.. భారత జట్టులోకి జైస్వాల్, గిల్‌.. హర్భజన్ సింగ్ కామెంట్స్ వైర‌ల్

Published : Aug 17, 2025, 05:17 PM IST

India Cricket Team: ఆసియా క‌ప్ 2025 కోసం భార‌త జ‌ట్టు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే హర్భజన్ సింగ్ ప్రకటించిన ఆసియా క‌ప్ భార‌త జట్టులో జైస్వాల్, గిల్‌కి చోటు దక్కగా సంజూ శాంస‌న్ కు త‌ప్పించారు. 

PREV
16
ఆసియా క‌ప్ - హర్భజన్ సింగ్ ప్రకటించిన భార‌త జ‌ట్టు

ఆసియా క‌ప్ 2025 కోసం భార‌త జ‌ట్టు ఎంపికపై 19న ముంబైలో బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. దీనికి ముందు ప‌లువురు మాజీలు జ‌ట్టులో ఉండాల్సిన ప్లేయ‌ర్ల‌ను గురించి ప్ర‌స్తావిస్తున్నారు.

తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన సర్ప్రైజ్ జట్టును ప్రకటించారు. ఇందులో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌కి చోటు కల్పించారు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టులో ఉండాలని హర్భజన్ స్పష్టం చేశారు. అవసరమైతే కేఎల్ రాహుల్‌ను రెండో వికెట్ కీపర్‌గా పరిగణించవచ్చని తెలిపారు.

DID YOU KNOW ?
ఆసియా కప్ - భారత్ రికార్డులు
ఆసియా కప్ లో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటివరకు ఇండియా 8 ఆసియా కప్ టైటిళ్లను గెలుచుకుంది.
26
గిల్ స్ట్రైక్ రేట్ వివాదంపై హర్భజన్ ఏమన్నారంటే?

గిల్‌కు సాంప్రదాయ ఓపెనర్‌గానే కాకుండా అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటే శక్తి ఉందనీ, పెద్ద ఇన్నింగ్స్ లు వ‌స్తాయ‌ని హర్భజన్ అన్నారు. “టీ20 అనగానే కళ్ళు మూసుకొని షాట్లు ఆడటం కాదు. గిల్ టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మన్. ఏ పరిస్థితిలోనైనా ఇన్నింగ్స్‌ను నియంత్రించగలడు” అని ఆయన వ్యాఖ్యానించారు. 

గిల్ ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన విష‌యాన్ని కూడా గుర్తు చేశారు. కొందరు చెప్పినట్లు 120 స్ట్రైక్ రేట్‌తో కాకుండా 150-160 రేట్‌తోనే గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడని స్పష్టం చేశారు.

36
సంజూ శాంస‌న్ కు షాక్

హ‌ర్భజన్ సింగ్ ఎంపిక చేసిన జ‌ట్టులో సంజూ శాంస‌న్ కు చోటు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, శ్రేయస్ అయ్యర్‌లకు ఆయన జట్టులో స్థానం కల్పించారు. 

సంజూ ఓపెనర్‌గా మూడు సెంచరీలు సాధించినప్పటికీ, బ్యాటింగ్ క్రమంలో వెనక్కి తగ్గవలసి రావచ్చని అంచనాలు ఉన్నాయి. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి మధ్య వరుస ఆటగాళ్లతో జట్టు బ్యాలెన్స్ కోసం సంజూకు స్థానంలో సమస్యలు ఏర్పడవచ్చని క్రికెట్ వర్గాలు చర్చిస్తున్నాయి.

46
ఆసియ క‌ప్ కోసం హర్భజన్ ఎంపిక చేసిన భార‌త జ‌ట్టు ఇదే

యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.

56
సూర్యకుమార్, బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ పాస్

ఇదిలావుండ‌గా, హెర్నియా శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతిలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడు. దీంతో అత‌ను ఆసియా కప్‌లో ఆడటం ఖాయం అయింది.

అలాగే, పేసర్ జస్ప్రిత్ బుమ్రా కూడా ఫిట్‌నెస్ టెస్ట్ అనంతరం టోర్నమెంట్‌కు సిద్ధమని సెలెక్టర్లకు తెలిపాడు. గతంలో ఇంగ్లాండ్ టెస్టుల్లో మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బుమ్రా తిరిగి రావడంతో జట్టుకు బలం చేకూరనుంది.

66
ఆసియా క‌ప్ 2025 షెడ్యూల్

2025 సెప్టెంబర్ 9న ఆసియా కప్ ప్రారంభం కానుంది. భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను 10న యూఏఈతో ఆడనుంది. సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ పోరు జరగనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అధికారిక భారత జట్టు జాబితాను సెలెక్టర్లు మంగళవారం ప్రకటించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories