ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్, 14 మ్యాచుల్లో 22 వికెట్లు పడగొట్టి ...ఆరెంజ్ ఆర్మీ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు...
umran malik
ఐపీఎల్ 2022 తర్వాత టీమిండియాలోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్‌ని రోహిత్ అండ్ కో సరిగ్గా వాడుకోలేదు. టీ20 వరల్డ్ కప్‌లో ఆయుధంగా మారతాడనుకున్న ఫాస్ట్ బౌలర్‌ని ముచ్చటగా మూడు మ్యాచుల్లో అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి, పక్కనబెట్టేశారు...
Image credit: Getty
‘టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఉమ్రాన్ మాలిక్ లేడు... హమ్మయ్య మేం బతికిపోయాం. ఈ డెవలప్... డెవలప్ అంటూ మంచి బౌలర్లను ఖరాబు చేస్తున్నారు. గొప్ప ప్లేయర్లు కనిపించినప్పుడు వారిని వీలైనంత త్వరగా అందుకుని, అవకాశాలిస్తూ సానబెట్టాలి... సానబెట్టిన తర్వాత వాడుకోవాలని చూడడం మూర్ఖత్వమే...
150+వేగంతో బంతులు వేసే బౌలర్ దొరికితే కళ్లకు అద్దుకుని టీ20 వరల్డ్ కప్‌లో ఆడించేవాళ్లం. అంతేకానీ డెవలప్ కావాలని ఎదురుచూస్తూ కూర్చోం... ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ మంచి స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్నాం. లైన్ అండ్ లెంగ్త్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది...
Image credit: PTI
ఓ లెజెండరీ ఫాస్ట్ బౌలర్‌గా మారడానికి ఇంతకంటే ఇంకేం కావాలి. అతనిలో నిజమైన టాలెంట్ ఉంది. ఆసియా కప్ సమయంలో కూడా ఇదే మాట చెప్పాను. వాళ్లు స్టార్లతో టీమ్‌ని నింపాలని చూస్తున్నారు. అయితే నిజమైన ఫ్యూచర్ స్టార్‌ని చూడలేకపోతున్నారు...
మేం ఆలోచించినట్టుగా వాళ్లు ఆలోచించకపోవడం ప్రత్యర్థి జట్లకి మంచి చేస్తుంది. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కానీ, మిస్బా వుల్ హక్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కానీ ఇలాంటి పిల్లాడు దొరికి ఉంటే, అతన్ని పాకిస్తాన్ బౌలింగ్ యూనిట్‌కి వెన్నెముకగా మార్చేవాళ్లం...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్...