సౌతాఫ్రికా టూర్‌కి సిద్ధమవుతున్న భారత జట్టుకి ఊహించని షాక్ తగిలింది. మరో మూడు రోజుల్లో సఫారీ పర్యటనకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భారత టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్ కోసం ఇప్పటికే భారత జట్టు, ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన ఫైవ్ స్టార్ హోటెల్‌లో క్వారంటైన్ గడుపుతోంది.
211
మూడు రోజుల పాటు సాగే క్వారంటైన్ ముగిసిన తర్వాత ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్‌లో నేరుగా జోహాన్‌బర్గ్ చేరుకునే భారత జట్టు, అక్కడ మరో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో గడుపుతుంది...
311
ఆ తర్వాత ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొని, డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ టెస్టు ఆడుతుంది. ఈ సిరీస్‌కి టెస్టు వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్న విషయం తెలిసిందే...
411
వన్డే టీమ్‌కి కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మను టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఏడాదిగా ఫెయిల్ అవుతున్న అజింకా రహానేను ఆ బాధ్యతల నుంచి తప్పించింది...
511
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొనని రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్‌లతో పాటు మొదటి టెస్టులో గాయపడిన అజింకా రహానే... కొన్నిరోజులుగా ముంబైలో బీసీసీఐ మినీ క్యాంపులో పాల్గొంటున్నారు...
611
భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఆధ్వర్యంలో ఈ ప్లేయర్లు, ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్స్‌లోనే రోహిత్ శర్మకు తీవ్ర గాయం అయ్యిందని సమాచారం...
711
ఇప్పటికే గాయాల కారణంగా చాలా సార్లు సిరీస్‌లకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. 2020 ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి రెండు టెస్టులు ఆడలేదు...
811
సౌతాఫ్రికా టూర్‌లో వైస్ కెప్టెన్‌గా, వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్న సమయంలో రోహిత్ శర్మ, మరోసారి గాయపడడంతో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...
911
అయితే రోహిత్ శర్మ ఫిట్‌గా ఉన్నాడని, ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడిన త్వరగానే కోలుకున్నాడని మొదటి టెస్టు సమయానికి జట్టుకి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారులు తెలియచేశారు...
1011
ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్యాంపుకి విరాట్ కోహ్లీ ఇలా రాలేదని సమాచారం. నేడు, లేదా రేపు విరాట్ కోహ్లీ క్వారంటైన్‌లో చేరతాడని సమాచారం...
1111
అన్ని విషయాల్లో అందరికంటే ముందు ఉండే విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా టూర్‌కి ముందు ఇలా లేటు చేయడానికి బీసీసీఐ వన్డే కెప్టెన్సీ విషయంలో వ్యవహరించిన తీరు నచ్చకపోవడమే అంటున్నారు అభిమానులు...