ఇక్కడ మూడు రోజులు, అక్కడ ఆరు రోజులు... సఫారీ టూర్‌లో కుటుంబాలకు అనుమతి లేదు...

First Published Dec 13, 2021, 2:52 PM IST

సౌతాఫ్రికా పర్యటనకి ముందు భారత జట్టు, ముంబైలో మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో గడపనుంది. అక్కడికి వెళ్లిన తర్వాత మరో ఆరు రోజుల పాటు బయో బబుల్‌లో గడపబోతున్నారు టీమిండియా క్రికెటర్లు...

సౌతాఫ్రికాలో పెరగుతున్న కరోనా ఒమిక్రాన్ కేసుల కారణంగా ఇప్పటికే ఆ దేశాన్ని ‘ఆందోళన’ ప్రాంతంగా గుర్తించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో)...

కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నెలలో జరగాల్సిన సౌతాఫ్రికా టూర్ ఉంటుందో, ఉండదోనని అనుమానాలు కూడా రేగాయి. అంతే సఫారీ క్రికెట్ బోర్డు రిక్వెస్ట్‌తో టూర్‌కి అంగీకరించింది బీసీసీఐ...

ఆటగాళ్ల భద్రత కంటే షెడ్యూల్ ప్రకారం సిరీస్‌లను ముగించడమే ప్రధాన ధ్యేయంగా భావిస్తున్నట్టుగా వన్డే, టెస్టు సిరీస్‌లు యథాతథంగా జరుగుతాయని ప్రకటించింది బీసీసీఐ...

నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌ను మాత్రం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులు... డిసెంబర్ 17న ప్రారంభం కావాల్సిన టూర్‌ను 26కి మార్చిన విషయం తెలిసిందే...

సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‌కి ప్రకటించిన జట్టులో ఉన్న ప్లేయర్లు అందరూ ముంబై ఎయిర్‌పోర్టుకి దగ్గర్లోని ఫైవ్ స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించింది బీసీసీఐ...

ఇప్పటికే డిసెంబర్ 12న ఆదివారం భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ కో... ముంబై చేరుకుని క్వారంటైన్‌లో ఉంటున్నారు...

మూడు రోజుల తర్వాత డిసెంబర్ 15న బీసీసీఐ ఏర్పాటు చేసే ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్‌లో నేరుగా జోహాన్‌బర్న్‌కి బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు... 

బయో బబుల్‌లో చేరడానికి ముందు రోహిత్ శర్మ, అజింకా రహానే, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్... ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో బౌలింగ్ పరాస్ మాంబ్రే ఆధ్వరంలో ఏర్పాటు చేసిన మినీ క్యాంప్‌లో పాల్గొన్నారు...

డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్టుతో ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్, జనవరి 23న జరిగే ఆఖరి వన్డేతో ముగియనుంది. టెస్టు సిరీస్‌కి ఎంపికైన ప్లేయర్లు, డిసెంబర్ 15న బయలుదేరితే, వన్డే జట్టును త్వరలో ప్రకటించనుంది బీసీసీఐ...

విజయ్ హాజారే ట్రోఫీ 2021-22 ముగిసిన తర్వాత వన్డే సిరీస్‌కి జట్టును ప్రకటించనుంది భారత క్రికెట్ బోర్డు. వన్డే సిరీస్‌కి కెప్టెన్ రోహిత్ శర్మను ప్రకటించినా వైస్ కెప్టెన్ ఎవరుంటారనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ...

సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్-ఏ జట్టులో సభ్యులుగా ఉన్న హనుమ విహారి, నవ్‌దీప్ సైనీ, సౌరబ్ కుమార్, దీపక్ చాహార్, అర్జన్ నాగస్‌వాలాలు దక్షిణాఫ్రికాలో ఉండి, భారత జట్టుతో కలవనున్నారు...

సౌతాఫ్రికా టూర్ ముగించుకుని స్వదేశం చేరుకున్న భారత్-A జట్టు సభ్యులు, ముంబైలో కాకుండా నేరుగా అహ్మదాబాద్ చేరుకున్నారు. ముంబైలో క్వారంటైన్‌ నిబంధనల కారణంగానే నేరుగా అహ్మదాబాద్‌కి చేరుకుంది భారత ఏ జట్టు...

పూర్తి బయో బబుల్ సెక్యూర్ జోన్‌లో జరిగే మ్యాచులు, మూసి ఉంచిన ఖాళీ స్టేడియాల్లో జరుగుతాయి. ముందు జాగ్రత్తగా ఈ టూర్‌కి కుటుంబాలతో కలిసి వెళ్లేందుకు అంగీకరించలేదు ఇరుజట్ల బోర్డులు...

click me!