ఇలా ఆడితే కష్టమే, జట్టులో చోటు దక్కించుకోలేడు... తెలుగు క్రికెటర్‌పై అజారుద్దీన్ కామెంట్...

Published : Jun 03, 2022, 10:23 AM IST

అజింకా రహానే ఫెయిల్యూర్‌తో లాభపడిన వాళ్లు ఎవ్వరైనా ఉన్నారంటే అది హనుమ విహారియే. సిడ్నీ టెస్టులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత తిరిగి తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి ఏడాది పాటు ఎదురుచూసిన విహారిపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్...

PREV
17
ఇలా ఆడితే కష్టమే, జట్టులో చోటు దక్కించుకోలేడు... తెలుగు క్రికెటర్‌పై అజారుద్దీన్ కామెంట్...

28 ఏళ్ల తెలుగు క్రికెటర్ హనుమ విహారి గత మూడున్నరేళ్లలో కేవలం 15 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 35.13 సగటుతో 808 పరుగులు చేశాడు విహారి...
 

27
Hanuma Vihari

సిడ్నీ టెస్టులో ఓటమి అంచుల్లో ఉన్న భారత జట్టును జిడ్డు బ్యాటింగ్‌తో కాపాడిన హనుమ విహారి, గాయంతో బాధపడుతూ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసి క్రికెట్ ప్రపంచం మన్ననలు పొందాడు...

37
Hanuma Vihari

‘ఇదే విహారికి సరైన సమయం. ఈ అవకాశాన్ని అతను రెండు చేతులతో ఒడిసి పట్టుకోవాలంటే భారీ స్కోర్లు చేయాలి. 50 లేదా 60 పరుగులు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు...

47

హనుమ విహారి ఓ అసాధారణ ఆటగాడు. టీమిండియా తరుపున సుదీర్ఘ కాలం ఆడగల సత్తా ఉన్న బ్యాటర్. అయితే జట్టులో స్థిరమైన చోటు దక్కించుకోవాలంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది...

57

ఈ విషయం హనుమ విహారి ఇప్పటికే గ్రహించి ఉంటాడని అనుకుంటున్నా... విహారి బ్యాటు నుంచి త్వరలోనే భారీ ఇన్నింగ్స్ వస్తుందని ఆశిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్...

67

భారత మిడిల్ ఆర్డర్ సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింకా రహానే పేలవ ఫామ్‌తో పాటు ఐపీఎల్ 2022 సీజన్‌లో గాయపడడంతో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టుకి ఎంపిక చేసిన జట్టులో హనుమ విహారికి చోటు దక్కింది...

77

జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ టెస్టు మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్‌ వంటి ప్లేయర్లతో ఐదో నెంబర్ బ్యాటింగ్ పొజిషన్ కోసం పోటీపడబోతున్నాడు హనుమ విహారి.. 
 

click me!

Recommended Stories