పాపం హనుమ విహారి... అందరి కంటే ముందుగా వెళ్లి, అందరికంటే ఆలస్యంగా...

First Published Sep 12, 2021, 7:39 PM IST

టీమిండియా టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ హనుమ విహారి, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయం చేస్తూ వార్తల్లో నిలిచిన విహారి, ఇప్పుడు వార్తల్లో ట్రెండ్ అవ్వడానికి ఓ కారణం ఉంది...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్‌లో సెప్టెంబర్ 10 నుంచి జరగాల్సిన ఐదో టెస్టు, కరోనా కారణంగా అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే... 

Hanuma Vihari

దీంతో షెడ్యూల్ కంటే ముందుగానే భారత ఆటగాళ్లు అందరికీ ఆయా ఫ్రాంఛైజీలు, ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 కోసం యూఏఈ రప్పించేసుకున్నాయి...

చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంఛైజీలు ప్రత్యేక విమానాల్లో తమ ప్లేయర్లను యూఏఈకి రప్పించుకోగా... మిగిలిన ఫ్రాంచైజీల ప్లేయర్లు కమర్షియల్ విమానాల్లో ఐపీఎల్ కోసం అబుదాబీ చేరుకున్నారు...

అంతా బాగానే ఉంది, భారత జట్టులో ఉండి, ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోని టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారి మాత్రం ఇంగ్లాండ్‌లో ఒంటరిగా మిగిలిపోయాడట...

అప్పుడెప్పుడూ ఐపీఎల్ 2021 సీజన్ సమయంలోనే కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచుల కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లాడు తెలుగు క్రికెటర్ హనుమ విహారి...

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌ విజృంభించి, జనాలు ఆక్సిజన్ సిలిండర్లు అందక అష్టకష్టాలు పడుతున్న సమయంలో... అక్కడి నుంచి తన ఫౌండేషన్ ద్వారా సాయం చేశాడు...

కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడిన అనుభవం ఉన్నప్పటికీ, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో హనుమ విహారికి అవకాశం దక్కలేదు...

విదేశాల్లో మంచి రికార్డు ఉన్నప్పటికీ... ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి నాలుగు టెస్టుల్లోనూ హనమ విహారి చోటు దక్కించుకోలేకపోయాడు...

సిడ్నీ టెస్టులో అద్వితీయమైన పోరాటంతో ఓటమి అంచున నిలిచిన మ్యాచ్‌ను డ్రాగా ముగించిన హనుమ విహారికి ఆ తర్వాత ఒక్క అవకాశం రాకపోవడం విశేషం...

అందరికంటే ముందుగా ఇంగ్లాండ్ చేరిన హనుమ విహారి, అందరూ వెళ్లిన తర్వాత కూడా అక్కడే మిగిలిపోయాడని సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్‌ వైరల్ అవుతున్నాయి...

ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో అమ్ముడుపోని హనుమ విహారి, బీసీసీఐ ఏర్పాటుచేసిన పయన వసతులతో త్వరలో స్వదేశానికి చేరుకోబోతున్నట్టు సమాచారం..

click me!